లక్ష్మీస్ ఎన్టీఆర్ యుట్యూబ్ లో వస్తుందా?

Mon Mar 25 2019 10:00:09 GMT+0530 (IST)

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సంబంధించి ఎలాంటి సమాచారం అందటం లేదు. అదుగో పులి ఇదుగో తోక తరహాలో 29 విడుదల అంటూ ప్రచారం చేస్తూనే ఉన్నారు కాని సెన్సార్ ఇప్పటికీ జరగనే లేదు. ఈ లెక్కన శుక్రవారం రిలీజయ్యే ఛాన్స్ దాదాపు లేనట్టే. ఒకవేళ సెన్సార్ యునానిమస్ గా క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చి కట్స్ ఏమి చెప్పకపోతే సాధ్యపడవచ్చేమో కాని కంటెంట్ దృష్ట్యా కొన్ని కోతలు మార్పులు తప్పేలా లేవు.సో వాయిదా పడటం అనివార్యం అనిపిస్తోంది. సరే ఆలస్యం అయితే ఏప్రిల్ 5కి పోస్ట్ పోన్ చేస్తారా అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. ఆ డేట్ లో చైతు మజిలి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఒకవేళ లక్ష్మీస్ ఎన్టీఆర్ రావాలి అనుకున్నా థియేటర్లకు కొరత లేదు కాని ముందస్తుగా చేయాల్సిన వ్యవహారాలు చాలా ఉంటాయి కాబట్టి ఏదైనా సరే క్లారిటీ ఉంటేనే బెటర్

ఒకవేళ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఎన్నికలు అయ్యేవరకే బ్రేక్ పడితే యుట్యూబ్ లో పెట్టేస్తారేమో అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు లేకపోలేదు. ఈ మాట వర్మ స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా. కాని ఈ వారం వచ్చినా రాకపోయినా ఇప్పట్లో దీన్ని యుట్యూబ్ లో పెట్టె ఛాన్స్ అయితే లేదు. వర్మ అన్నది నన్ను చంపితే ఆన్ లైన్ లో వదులుతాను అన్నాడు కాని సెన్సార్ ఆగిపోతేనో లేదా విడుదల అడ్డుకుంటేనో అనలేదు.

ఇప్పుడు వచ్చినా రాకపోయినా కాస్త ఆలస్యంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తారేమో కాని లక్ష్మీస్ ఎన్టీఆర్ ని యుట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు అని ఆశలు పెట్టుకుంటే వర్మను తక్కువ అంచనా వేసినట్టే. కాకపోతే పోలింగ్ తేది ఏప్రిల్ 11లోపే లక్ష్మీస్ ఎన్టీఆర్ ని విడుదల చేయాలనీ గట్టిగా ట్రై చేస్తున్న వర్మ సోషల్ మీడియాలో మార్ఫింగ్ పిక్స్ తో చేస్తున్న హడావిడి తప్ప అసలు మ్యాటర్ బయటికి రావడం లేదు.