Begin typing your search above and press return to search.

పవన్ థియేటర్లకు వచ్చేదెప్పుడు?

By:  Tupaki Desk   |   27 Jun 2017 8:04 AM GMT
పవన్ థియేటర్లకు వచ్చేదెప్పుడు?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాస్ట్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ఆశించినంత విజయం సాధించకపోవడంతో అభిమానులంతా లేటెస్ట్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఇండస్ట్రీ ఆల్ టైం రికార్డు కొట్టిన అత్తారింటికి దారేది డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పవన్ రీసెంట్ గా ఏ సినిమాకు పనిచేయనంత వేగంగా త్రివిక్రమ్ సినిమాకు పనిచేస్తుున్నాడు. కానీ రిలీజ్ డేట్ ఎప్పుడనేది కన్ఫర్మ్ చేయడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీని బలోపేతం చేసుకునేందుకు పవన్ ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇందుకోసం సినిమా కమిట్ మెంట్స్ త్వరగా పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నాడు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలతో షూటింగ్ కు అనుకోని బ్రేకులు పడుతున్నాయట. అందుకే షూటింగ్ ఎప్పటికి పూర్తి అవుతుందనే దానిపై మూవీ మేకర్స్ ఇంతవరకు ఓ కంక్లూజన్ కు రాలేదు. సెప్టెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలని డైరెక్టర్ త్రివిక్రమ్ అనుకుంటున్నారు. ప్రాథమికంగా షూటింగ్ పనులు పూర్తి చేశాక రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని అనుకుంటున్నారనేది యూనిట్ వర్గాల మాట.

కీర్తి సురేష్ అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్.రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ తొలిసారిగా వపన్ కళ్యాణ్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఇప్పటికే పూర్తి కావడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/