Begin typing your search above and press return to search.

గోపీచందూ.. ‘ఆక్సిజన్’ ఏదమ్మా?

By:  Tupaki Desk   |   21 Oct 2017 4:21 AM GMT
గోపీచందూ.. ‘ఆక్సిజన్’ ఏదమ్మా?
X
యాక్షన్ హీరో గోపీచంద్ సినిమాలకు గ్రహణం పట్టేస్తోంది ఈ మధ్య. సీనియర్ దర్శకుడు బి.గోపాల్ డైరెక్షన్లో గోపీచంద్ నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ విడుదలకే నోచుకోకుండా వెనక్కి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ‘ఆక్సిజన్’ పరిస్థితి కూడా ఏమంత భిన్నంగా లేదు. రెండేళ్ల పాటు ప్రొడక్షన్లో ఉన్న ఈ సినిమా ఈ మధ్యే పూర్తయింది. ఈ సినిమా విడుదల తేదీని మళ్లీ మళ్లీ మారుస్తున్నారు. ఆగస్టు 18కే అనుకున్న ఈ సినిమా తర్వాత అక్టోబరు 13కు వాయిదా పడింది. అక్కడి నుంచి అక్టోబరు 27కు కొత్త డేట్ ఇచ్చారు. ఈ తేదీకి సినిమా పక్కా అన్న చిత్ర బృందం.. తర్వాత సైలెంటైపోయింది. చూస్తుండగానే అక్టోబరు 27 దగ్గర పడిపోయింది.

ప్రస్తుతం ‘ఆక్సిజన్’ టీం తీరు చూస్తుంటే.. వచ్చే వారాంతంలో ఈ సినిమా విడుదల కాదని స్పష్టమవుతోంది. ఈ నెల 15కే అనుకున్న ఆడియో వేడుకను సైతం 23కు వాయిదా వేశారు. మరి ఆ రోజైనా ఆడియో వేడుక జరుగుతుందేమో చూడాలి. ‘ఆక్సిజన్’ రాకపోవడంతో వచ్చే వీకెండ్లో ‘ఉన్నది ఒకటే జిందగీ’ సోలో బ్యాటింగ్ కు రెడీ అవుతోంది. తమిళ సినిమా ‘అదిరింది’ కూడా వచ్చే వారమే రిలీజవుతున్నా.. దాన్నుంచి పెద్దగా ముప్పేమీ లేదు ‘ఉన్నది ఒకటే జిందగీ’కి. నవంబర్లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేని నేపథ్యంలో ‘ఆక్సిజన్’ను ఆ నెలలో అయినా రిలీజ్ చేస్తారేమో చూడాలి. గోపీచంద్ సరసన రాశి ఖన్నా.. అను ఇమ్మాన్యుయెల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం నిర్మాణంలో ఆయన తనయుడు జ్యోతికృష్ణ తెరకెక్కించాడు.