Begin typing your search above and press return to search.

మహేష్ పచ్చజెండా ఎవరికో ?

By:  Tupaki Desk   |   25 May 2019 2:30 PM GMT
మహేష్ పచ్చజెండా ఎవరికో ?
X
అదేదో సామెత చెప్పినట్టు ఇంకా మహేష్ 26 మొదలుకానే లేదు అప్పుడే 27 గురించి చర్చలు మొదలైపోయాయి. హాలిడేస్ ని విదేశాల్లో ఫ్యామిలీతో సహా ఎంజాయ్ చేస్తున్న ప్రిన్స్ సినిమాల గురించి ఆలోచించే మూడ్ లో ఏ మాత్రం లేడు. వచ్చాక అనిల్ రావిపూడి ఇచ్చే ఫుల్ నెరేషన్ తో మన లోకంలోకి వస్తాడు కాని అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. ఈలోపు అనిల్ ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసే దిశగా నిర్మాత అనిల్ సుంకరతో కలిసి సాగుతున్నాడు.

దీని తర్వాత ఎవరితో సినిమా చేస్తాడనే దాని గురించి నిజంగా మహేష్ కు సైతం క్లారిటీ ఉన్నట్టు లేదు. ఒక టైంలో ఒక సినిమా గురించి మాత్రమే సీరియస్ గా ఫోకస్ పెట్టె అలవాటు ఉన్న మహేష్ మహర్షి ప్రీ రిలీజ్ లో ఇకపై స్క్రిప్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే ఇప్పుడు క్యు చాలా పెద్దదే ఉంది. పరశురాం లైన్ చెప్పాడని ఒక టాక్ కబీర్ సింగ్ రిలీజ్ కాగానే సందీప్ వంగా వచ్చి ఓ కథ వినిపిస్తాడని మరో న్యూస్ అల్లు అర్జున్ తో పాటు మహేష్ కోసం కూడా సుకుమార్ ఓ స్ట్రాంగ్ స్టొరీ రాసుకుంటున్నాడని ఇంకో వార్త ఇలా చాలా ప్రచారాలే జరుగుతున్నాయి.

ఇవి చాలదు అన్నట్టు ఆరెక్స్ 100 ఫేం అజయ్ భూపతి కూడా మహేష్ ని ఇటీవలే కలిశాడన్న మాట ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. అతడు-ఖలేజా తర్వాత మళ్ళి సాధ్యపడని మహేష్-త్రివిక్రమ్ ల జోడి కూడా రిపీట్ కావోచ్చనే దిశగా చర్చలు జరుగుతున్నాయట. చూస్తుంటే మహేష్ ఇరవై ఏడో సినిమాకు పెద్ద అయోమయమే నెలకొనేలా ఉంది. ఇవన్ని క్లియర్ కావాలి అంటే కనీసం రెండు మూడు నెలలు ఆగితే తప్ప ప్రాధమిక సమాచారమైనా వచ్చేలా లేదు.