Begin typing your search above and press return to search.

అనిరుద్ తప్పుకోలేదా

By:  Tupaki Desk   |   19 Jan 2018 6:11 AM GMT
అనిరుద్ తప్పుకోలేదా
X
అజ్ఞాతవాసి రిజల్ట్ చూసాక పవన్ అభిమానుల తర్వాత కాస్త టెన్షన్ పడింది యంగ్ టైగర్ ఫాన్సే. దానికి రెండు కారణాలు. మొదటిది త్రివిక్రమ్ మునుపటి మేజిక్ ఇందులో పూర్తిగా మిస్ కావడం, రెండు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇస్తాడు అని ఆశించిన అనిరుద్ తన స్థాయికి తగ్గ అవుట్ పుట్ ఇవ్వకపోవడం. దీంతో త్రివిక్రమ్ తమ హీరోతో చేయబోయే మూవీపై కూడా ఇవి కంటిన్యూ అవుతాయేమో అని జూనియర్ ఫ్యాన్స్ భయపడ్డారు. ఒకదశలో తారక్ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకుంటున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్ రోజు తప్ప ఆ ప్రాజెక్ట్ గురించి ఇంకే అప్ డేట్ త్రివిక్రమ్ టీం నుంచి బయటికి రాలేదు కనక ఇవన్ని ఊహాగానాలకే పరిమితమయ్యాయి. కానీ తాజాగా వచ్చిన సమాచారం మేరకు అనిరుద్ తారక్ సినిమా నుంచి తప్పుకోలేదట.

అజ్ఞాతవాసికి అగ్రిమెంట్ చేసుకున్న టైంలోనే అనిరుద్ తో రెండు సినిమాలకు వర్క్ చేసేలా ఒప్పందం జరిగిందని, అందులో భాగంగానే ఇప్పుడు కూడా కంటిన్యూ చేసే ఉద్దేశంలో ఉన్నారని తెలుస్తోంది. దానికి తోడు అనిరుద్ చేసింది ఒక్క సినిమానే కాబట్టి దాన్ని బట్టే ఇక బాగా ఇవ్వలేడేమో అనే నిర్ణయానికి రావడం ఎందుకు అని ఆలోచించినట్టు టాక్. ప్రస్తుతం ఈ మూవీ కోసమే ట్యూన్స్ కంపోజ్ చేయటంలో అనిరుద్ బిజీగా ఉన్నాడని చెబుతున్నారు. అజ్ఞాతవాసి విడుదలకు ముందు నుంచి ఇప్పటి దాకా త్రివిక్రమ్ నేరుగా మీడియాతో ఇప్పటి దాకా ఇంటరాక్ట్ అవ్వలేదు. సో వీటి గురించి క్లారిటీ నిర్మాత చినబాబు ఇవ్వాలి కాని ఆయనా అందుబాటులో లేరు. సో అనిరుద్ ని కొనసాగించడం దాదాపు ఖరారు అని వినిపిస్తున్న నేపధ్యంలో దీనికైనా బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు యంగ్ టైగర్ ఫాన్స్. దీని గురించి మరి కొద్ది రోజుల్లోనే పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.