Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ 3 హోస్ట్‌ గా తారక్‌.! అంత టైమ్‌ ఉందా.?

By:  Tupaki Desk   |   17 Jan 2019 6:19 AM GMT
బిగ్‌ బాస్‌ 3 హోస్ట్‌ గా తారక్‌.! అంత టైమ్‌ ఉందా.?
X
బిగ్‌బాస్‌ 1 - 2 రెండూ పూర్తయ్యాయి. మొదటి సీజన్‌ కు ఎన్టీఆర్‌ హోస్ట్‌ అవ్వడం - ఇలాంటి ఫార్మాట్‌ తెలుగులో తొలిసారి కావడంతో.. ఆటోమేటిగ్గా ప్రోగ్రామ్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. ఎన్టీఆర్‌ కూడా అద్భుతంగా చేసి ఔరా అన్పించాడు. ఆ తర్వాత రెండో సీజన్‌ కు నాని హోస్ట్ చేశాడు. హోస్ట్‌ గా ఫస్ట్‌ సీజన్‌ లో ఎన్టీఆర్ బాగా చేయడంతో.. నానితో అతనితో పోల్చారు. దీంతో.. ఎన్టీఆర్‌ ముందు నాని తేలిపోయాడు. అయితే.. ఇప్పుడు బిగ్‌ బాస్‌ 3 ని మొదలుపెట్టేందుకు స్టార్‌ మా యాజమాన్యం ప్రయత్నాలు మొదలుపెట్టింది. హోస్ట్ దగ్గరే అసలు సమస్య వచ్చిపడింది. ఎవ్వర్ని అడిగినా నో చెప్తున్నారు. దీంతో.. అందరి చూపు ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్‌ వైపే వెళ్లింది.

బిగ్‌ బాస్‌ తో తారక్‌ కు మంచి పేరు వచ్చింది. రెమ్యూనరేషన్‌ కూడా బాగా గిట్టుబాటు అయ్యింది. మనసులో మళ్లీచెయ్యాలి అని అన్పించినా.. చేసేంత టైమ్‌ ఎన్టీఆర్‌ కు లేదు. ఎందుకంటే..తారక్‌ రాజమౌలి సినిమా కోసం దాదాపు 10 నెలల కాల్షీట్లు ఇచ్చేశాడు. అవి పూర్తయ్యే వరకు బయట కన్పించకూడదు. వేరే సినిమాకు కమిట్‌ అవ్వకూడదు. 10 నెలల తర్వాత కనీసం రెండు నెలల రెస్ట్ తీసుకుంటాడు. ఆ తర్వాతే సినిమాలైనా - బిగ్‌ బాస్‌ అయినా. సో..ఎన్టీఆర్‌ బిగ్‌ బాస్‌ 3 సీజన్‌ చేసే అవకాశమే లేదు.