Begin typing your search above and press return to search.

యంగ్ టైగరా- నో ఛాన్స్

By:  Tupaki Desk   |   17 March 2018 4:52 AM GMT
యంగ్ టైగరా- నో ఛాన్స్
X
నిన్నా మొన్నటి దాకా టిడిపితో దోస్త్ మేరా దోస్త్ అన్న పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో బాబుతో పాటు లోకేష్ అవినీతి మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో ఈ ఫ్రెండ్ షిప్ కి పూర్తిగా బ్రేక్ పడినట్టేనని పరిశీలకుల అభిప్రాయం. గత ఎన్నికల్లో పూర్తిగా అని చెప్పలేం కాని టిడిపి విజయావకాశాలను పవన్ కొంత సానుకూలంగా మళ్లేలా చేసాడన్నది నిజం. ఇప్పుడు తనకు తానుగా దూరమైపోయాడు కాబట్టి పవన్ ఇమేజ్ కు ప్రత్యాన్మయంగా జూనియర్ ఎన్టీఆర్ ను బరిలోకి దింపాలని చంద్రబాబు నాయుడు మీద పరోక్ష ఒత్తిడి చాలానే ఉంది. ఆ మధ్య తెలంగాణా పార్టీ సమావేశంలో ఓ సభ్యుడు బాబుని నేరుగా ఇదే మాట అడిగేసాడు. వచ్చే ఎన్నికలకు తారక్ ప్రచార బాధ్యతలు తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. కాని తారక్ మనసులో మాట, ప్లానింగ్ మరోలా ఉందని బాగా గమనిస్తే అర్థమవుతుంది.

సరైన టైం లో సక్సెస్ ట్రాక్ లో పడ్డ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఏ మాత్రం తొందరపడకుండా జాగ్రత్తగా ఉంటున్నాడు. టెంపర్ - నాన్నకు ప్రేమతో - జనతా గ్యారేజ్ - జై లవకుశ వీటిలో ఏదీ నిరాశపరిచిన సినిమా కాకపోవడంతో తారక్ మార్కెట్ మెల్లగా ఎగబాకుతోంది. ఇంకొంచెం గట్టిగా ఫోకస్ పెడితే ఓవర్సీస్ లో కూడా మినిమం గ్యారెంటీ స్టార్ గా మరతాడు. ఈ నేపధ్యంలో రాజకీయాలు - ప్రచారాలు అంటూ దిగితే సినిమా కెరీర్ కు ఇబ్బంది కలగడమే కాక తనను ఒక వర్గానికే పరిమితం చేసే అవకాశాలు ఉండటంతో కనీసం ఆ ఆలోచన కూడా చేయటం లేదని టాక్. త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యే లోపు దీపావళి దాటేస్తుంది. ఆ వెంటనే రాజమౌళితో చరణ్ మల్టీ స్టారర్ లో జాయిన్ అవ్వాలి. దానికి రెండు వందల రోజులకు పైగా జక్కన్న ఇద్దరి నుంచి కాల్ షీట్స్ డిమాండ్ చేసాడని ఇప్పటికే టాక్ ఉంది.

ఈ నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ గురించి ఆలోచించే స్థితిలో లేడు. నాన్న హరికృష్ణ తటస్థంగా ఉండటం, అన్న హీరోగా నిర్మాతగా బిజీ కావడం, తనకు వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ చేతిలో ఉండటం ఈ కారణాలన్నీ దృష్ట్యా అభిమానులు అడిగినా చిరునవ్వు నవ్వి సినిమా గురించి తప్ప దేని గురించీ మాట్లాడే ఆసక్తి, అవసరం ఇప్పుడు లేదని జూనియర్ స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ రకంగా చూసుకుంటే తారక్ తెలివైన నిర్ణయాన్ని మెచ్చుకోవాల్సిందే.