Begin typing your search above and press return to search.

ఈమె ఒక్కతే ఇలా మిగిలిపోయింది

By:  Tupaki Desk   |   23 Feb 2018 2:30 AM GMT
ఈమె ఒక్కతే ఇలా మిగిలిపోయింది
X
బిగ్ బాస్.. అన్ని దేశాలలోనూ బాగా పాపులారిటీ ఉన్న రియాలిటీ షో ఇది. ఇండియా లో ముందు హిందీ లో తర్వాత తమిళ్ మరియు తెలుగు కు కూడా వ్యాపించింది. షో ఒక ఎత్తు అయితే హోస్ట్ అయిన ఎన్టీఆర్ ఇంకొక ఎత్తు. ఎన్టీఆర్ లో ఒక కొత్త కోణాన్ని బయటికి తెచ్చి ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్. అలాంటి బిగ్ బాస్ అందులోని కాంటెస్టెంట్స్ కి ఎం చేసింది?

14 మందితో మొదలై - ఒక్కో వారానికి ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తూ - మధ్యలో ఇద్దర్ని వైల్డ్ కార్డు తో రప్పించి 2 నెలలకు పైగా ఉత్కంఠ భరితంగా సాగింది బిగ్ బాస్ షో. శివ బాలాజీ విన్నర్ అయ్యి ప్రైజ్ మనీ ఇంటికి తీసుకెళ్లగా ఆదర్శ్ రన్నర్ అప్ గా బిగ్ బాస్ హౌస్ కి వీడ్కోలు చెప్పాడు. ఇందులో కనిపించిన అందరూ మాత్రం ఎనలేని క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ముందుగా మహేష్ కత్తి. అప్పటిదాకా ఎవరో తెలీదు కానీ ఇప్పుడు తెలియని వారు లేరు. నవదీప్ ఒక పక్క సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ - మరో వైపు టాలీవుడ్ స్క్వేర్స్ అనే టీవీ షో తో బిజీ అయిపోయాడు. హరి తేజ గురించి చెప్పనక్కరలేదు. ఫిదా టీవీ షో తో సెలెబ్రిటీలని మనకి మరింత దగ్గరగా తీసుకొస్తోంది. దీక్ష కూడా అక్కడక్కడా టీవీ షోస్ లో కాంటెస్టెంట్ గా చేస్తోంది. అటు ధన రాజ్ సినిమాలతో - మధు ప్రియ సూపర్ సింగర్ తో తీరిక లేకుండా ఉన్నారు. కానీ అసలు కనిపించకుండా పోయింది మాత్రం ముమైత్ ఖాన్. 49 రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటికీ కూడా ముమైత్ ఖాన్ కు ఇప్పుడు అవకాశాలు రావట్లేదు. తన కన్నా తక్కువ రోజులు ఉన్నవారికి కూడా చేతిలో ఆఫర్లు ఉన్నాయ్ కానీ ముమైత్ వైపు మాత్రం ఎవరు ఎందుకు చూడట్లేదు?

నిజానికి షో మొదలవకముందే ముమైత్ అప్పట్లో సంచలనం సృష్టించిన డ్రగ్ స్కాండల్ లో ఇరుక్కుంది. షో మొదలయ్యాక కూడా ఒక రెండు రోజులు ఆ డ్రగ్ కేస్ విచారణకై బయటికి వెళ్లి మళ్ళీ వచ్చింది. కేవలం డ్రగ్స్ కేస్ తనపై ఉందని మాత్రమే ఈమెను పక్కన పెట్టారా? ముమైత్ మాత్రం సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ తన సౌందర్య రహస్యాలు చెప్తాను అంటూ పోస్టులు పెడుతోంది. ఫాన్స్ మాత్రం అంత పెద్ద గేమ్ షో లో అన్ని రోజులు చేసినా ఆఫర్లు ఎందుకు రావట్లేదు చెప్మా అంటూ తలలు పెట్టుకుంటున్నారు.