Begin typing your search above and press return to search.

భల్లాల వైఫ్‌ గురించే భారీ డిస్కషన్

By:  Tupaki Desk   |   29 April 2017 9:49 AM GMT
భల్లాల వైఫ్‌ గురించే భారీ డిస్కషన్
X
గతంలో మనం ఆల్రెడీ చెప్పినట్లు.. అసలు రాజమౌళి బాహుబలి-2 సినిమాలో ఏమేమి చూపిస్తాడు అనే విషయంపై అనేక చర్చలు నడిచాయి. అయితే తొలి పార్టులో కనిపించిన అస్లాం ఖాన్ ఈ రెండో పార్టులో లేకపోవడంతో ఫీలైన కొందరు అభిమానులు.. సోషల్ మీడియాలో ఇదే విషయంపై నానా హంగామా చేస్తున్నారు. ఇక ఇప్పుడు భల్లాలదేవ గురించి కూడా సేమ్ టు సేమ్ ఇటువంటి డిస్కషనే నడుస్తోంది.

తొలిభాగంలో భల్లాలదేవ కొడుకుగా యువరాజుగా.. అడివి శేష్ కనిపించాడు. ఇకపోతే ఇంటర్వెల్ తరువాత వచ్చే సీన్లలో శివుడు క్యారక్టర్ అతడి తల నరికేస్తాడు. ఇప్పుడు రెండో భాగంలో అదే తలను పట్టుకుని దండయాత్రకు కూడా వస్తారు. అయితే ఇదంతా ఓకె కాని.. అసలు భల్లాలదేవకు ఇంత పెద్ద కొడుకును ఇచ్చిన ఆ వైఫ్‌ ఎవరు? భల్లాల భార్య క్యారెక్టర్ సినిమాలోకి అవసరం అనుకున్నారేమో కాని.. కనీసం కొడుకు చనిపోయాడు అన్న బాధను చెప్పడానికి అయినా ఆమె కనిపించాలి కదా? ఎంతసేపు నువ్వు బాహుబలితో 1 సంవత్సరం ఉంటే నాతో మాత్రం 25 సంవత్సరాలు మాహిష్మతిలో బందీగా ఉన్నావు అంటూ భల్లాలదేవ పంచులు వేయడమే కాని.. ఇంతకీ తన భార్యతో ఎప్పుడూ మాట్లాడడా?

ఈ విధంగా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. మరి రాజమౌళి దీనిపై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/