ఈ లుక్ లో ఇద్దరూ భలేగున్నారే

Sun Aug 13 2017 12:40:43 GMT+0530 (IST)

ప్రస్తుత రోజుల్లో యువ హీరోలు ఒక్క హిట్ రాగానే ఏ మాత్రం ఆగడం లేదు. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ వారికంటూ ఓ మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. అదే తరహాలో ఫాస్ట్ ఫాస్ట్ గా సినిమాలు తీస్తూ హిట్స్ అందుకుంటున్న హీరో నివిన్ పాలీ. మలయాళంలో లవ్ స్టోరీస్ తో తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్న ఈ హీరో మలయాళం ప్రేమమ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.ఇప్పుడు రెగ్యులర్ సినిమాలను పక్కన పెట్టి కొత్త తరహా చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. 90ల కాలం నాటి ఓ కొత్త తరహా కథతో రాబోతున్నాడు.  రీసెంట్ గా ఆ చిత్రానికి సంబందించిన ఓ స్కెచ్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. "కయంకులం కోచున్నీ" అనే టైటిల్ లో రోషన్ ఆండ్రూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఆ స్కెచ్ ఫోటోలో నివిన్-అమలాపాల్ లుక్స్ చాలా బావున్నాయి. ఈ చిత్రంలో నివిన్ ఓ దొంగగా నటిస్తున్నడట. ఇక అమలాపాల్ ట్రెడిషినల్ లుక్ లో ఆ కాలంలో లో ఉండే యువతిగా చిత్రంలో కనిపించనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సినిమా యూనిట్ చాలా నమ్మకం గా ఉందట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.