నడుము ఒంపులే ఆమె ఆయుధం

Tue Sep 12 2017 23:00:01 GMT+0530 (IST)

ప్రస్తుతం టాలీవుడ్ పై మలయాళీ భామల దాడి ఫుల్ స్పీడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ట్యాలెంట్ తో పాటు అందం కూడా తోడైన ఈ ముద్దుగుమ్మలు.. తెలుగు తెరను వేడెక్కించేస్తున్నారు. వీరిలో నివేదా థామస్ మంచి స్పీడ్ మీద ఉందని చెప్పాలి.ఇప్పటికే నానితో కలిసి జెంటిల్ మాన్.. నిన్ను కోరి చిత్రాలతో సందడి చేసిన ఈ భామ.. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ జై లవ కుశతో ఆడియన్స్ మందుకు రానుంది. ఇప్పటివరకూ ఈమె కనిపించిన టాలీవుడ్ సినిమాలన్నిటిలోనూ ఎంతో సంప్రదాయంగా కనిపించింది. ట్యాలెంట్ మినహాయిస్తే.. అందాల ప్రదర్శన వైపు మొగ్గలేదు. కానీ ఇప్పుడు జై లవ కుశలో కొంత ట్రెండ్ మార్చినట్లుగా కనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ ప్రోమోను చూస్తే.. నడుము ఒంపులను బాగానే ప్రదర్శించినట్లు అర్ధమవుతుంది. అంతే కాదు.. జై లవ కుశ ఈవెంట్ లో కూడా తన నడుమొంపులను కొంత మేర ఎగ్జిబిట్ చేసింది నివేదా. అంతే కాదు.. రీసెంట్ గా ఓ షాప్ లాంఛింగ్ సందర్భంగా కూడా ఇదే తరహా మెలికలను ప్రదర్శించింది నివేదా థామస్.

ఇదంతా గమనిస్తే.. ఎక్కువగా అందాలను చూపించేయకపోయినా.. తన నడుం అందాలను మాత్రం ఆయుధంగా ఎంచుకుందని ఫిక్స్ అయిపోవచ్చు. అయితే.. ట్యాలెంటెడ్ బ్యూటీ ఇమేజ్ కంటే.. గ్లామర్ ప్లస్ ట్యాలెంట్ అంటే అప్పుడు క్రేజ్ మరింతగా ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని ఈ భామ బాగానే అర్ధం చేసుకున్నట్లుగా ఉంది కదూ.