ప్రేమతో ఎంత చక్కగా చెప్పిందో

Sat Sep 23 2017 22:30:01 GMT+0530 (IST)

మలయాళి ముద్దుగుమ్మలకు తెలుగులో చాలా ఆదరణ దక్కుతుండడం ఈ రోజుల్లో సాధారణం అయిపొయింది. మన ప్రేక్షకులు అక్కడి భామల నవ్వులకు మొదటి చూపులోనే పడిపోతారు. హాటుగా కనిపించడం కన్నా అందంగా కనిపిస్తేనే ఎక్కువగా ఆదరణ దక్కుతుంది. ఆ విషయంలో అక్కడి ముద్దుగుమ్మలు ఎప్పుడు ఫస్ట్ ఉంటారు. ఈ మధ్య కాలంలో అడుగుపెట్టిన మళయాళి బ్యూటీ నివేదా థామస్ మంచి విజయాలతో దూసుకుపోతోంది.జెంటిల్ మెన్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అమ్మడికి అదృష్టం బాగానే కలిసివస్తోంది. ఆ సినిమా తరువాత నిన్ను కోరి అనే సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకొని ఫైనల్ గా యంగ్ టైగర్ తో జతకట్టి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. నటనలోనూ మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు టాలీవుడ్ బడా హీరోల దృష్టిని తనవైపుకు తిప్పుకునేలా చేసుకుంటోంది. అయితే జై లవకుశ తో వరుసగా మూడవ విజయం అందుకోవడంతో నివేద తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.        

‘ఒక సినిమా హిట్ అవడం స్పెషల్. చేసిన మొదటి మూడు సినిమాలనూ ఇంత బాగా ఆదరించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నన్ను సొంత మనిషిలా చూడటం కన్నా పెద్ద ప్రశంస ఏమీ ఉండదు. దీనిని ఆశీర్వాదంగా భావిస్తున్నా. నా అభిమానులకు నా కుటుంబ సభ్యులకు ఎలా ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ‘జై లవకుశ’కు ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు థాంక్యూ... త్వరలో ఒక కొత్త చిత్రంలో సరికొత్తగా మళ్లీ మిమ్మల్ని కలుస్తాను. ప్రేమతో మీ నివేదా థామస్’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు.