Begin typing your search above and press return to search.

నిత్య మాట: డ్యాన్సుల్లో బన్నీ కన్నా ఎన్టీఆరే..

By:  Tupaki Desk   |   28 July 2016 11:30 AM GMT
నిత్య మాట: డ్యాన్సుల్లో బన్నీ కన్నా ఎన్టీఆరే..
X
మనసుకు ముసుగేసుకోకుండా మాట్లాడ్డం నిత్యా మీనన్‌ కు అలవాటు. తన మనసుకు ఏమనిపిస్తే అది మాట్లాడేస్తుంది నిత్య. తన అభిప్రాయాల్ని స్వేచ్ఛగా బయటపెట్టడానికి ఏమాత్రం వెనుకాడదు. ఇలాగే తెలుగులో హీరోయిన్ అయిన కొత్తలో ప్రభాస్ ప్రస్తావన తెస్తే.. ‘ఎవరతను’ అని అడిగేయడంపై వివాదం చెలరేగింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా అవసరం లేకున్నా జూనియర్ ఎన్టీఆర్-అల్లు అర్జున్ మధ్య పోలిక తెస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ‘తెలుగులో బన్నీ.. ఎన్టీఆర్ లతో చేశారు కదా. వారి గురించి..’ అన్నది ప్రశ్న. దీనికి సమాధానంగా.. ‘‘వాళ్లిద్దరూ ఎనర్జీకి మారు పేరుగా ఉంటారు. ఎనర్జీ లెవెల్స్‌ విషయంలో వాళ్లతో పోటీపడడం కష్టమే. ఇద్దరూ డ్యాన్సులు బాగా చేస్తారు. కానీ నాకు జూనియర్ డ్యాన్సులంటే ఇష్టం’’ అని చెప్పింది నిత్య.

ఇద్దరూ డ్యాన్సులు బాగాచేస్తారు అని అక్కడితో ఆపేయకుండా నాకు జూనియర్ డ్యాన్సులంటేనే ఇష్టం అనడంతోనే వచ్చింది సమస్య. అయినా ఇంటర్వ్యూయర్ వీళ్లిద్దరిలో ఎవరు బెస్ట్ డ్యాన్సర్ అని కూడా అడగలేదు కదా. అలా అడిగినా కూడా సమాధానం దాటవేయచ్చు. కానీ ప్రశ్నలో చాలా సింపుల్ గా ఉన్నా నిత్య మాత్రం తనదైన శైలిలో ఆన్సర్ చెప్పి దీని మీద ఓ చర్చకు తావిచ్చింది.