Begin typing your search above and press return to search.

అబ్బ.. నితిన్ ఎంత మంచోడో!!

By:  Tupaki Desk   |   5 May 2016 1:41 PM GMT
అబ్బ.. నితిన్ ఎంత మంచోడో!!
X
కొన్నాళ్ల క్రితం యంగ్ హీరో నితిన్ పై ఓ టాక్ వచ్చింది. సూర్య పైనా, సూర్య నటిస్తున్న 24 మూవీ పైనా నితిన్ సీరియస్ గా ఉన్నాడన్నది ఆ న్యూస్ సారాంశం. నిజానికి తన మూవీ అ..ఆ.. ను మే 6న విడుదల చేద్దామని భావించాడు ఈ యంగ్ హీరో. కానీ అదే రోజున సూర్య తన 24ను విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో.. నితిన్ తన మూవీని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

సూర్యపై నితిన్ గుర్రుగా ఉన్నాడని చెప్పడానికి మరో రీజన్ కూడా ఉంది. 24 తెలుగు వెర్షన్ ను నితిన్ - తన తండ్రి సుధాకర్ రెడ్డి రిలీజ్ చేద్దామని భావించారు. ఆల్మోస్ట్ డీల్ కూడా ఓకే అయిందని చెప్పారు. కానీ సడెన్ గా ఏమైందో తెలీదు కానీ.. సూర్య తన కజిన్ జ్ఞానవేల్ రాజా సహాయంతో స్టూడియో గ్రీన్ ద్వారా 24ని రిలీజ్ చేసేస్తున్నాడు. ఈ ఎఫెక్ట్ తో సూర్య అంటే నితిన్ కి ఏ మాత్రం సెట్ కాలేదని అన్నారు. కానీ ఇప్పుడు నితిన్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తి కలిగించింది.

'నా స్నేహితుడు - డైరెక్టర్ విక్రమ్ మరియు సమంత, సూర్యలతో పాటు మొత్తం యూనిట్ అందరికీ 24 విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. మూవీ రిలీజ్ కోసం ఇక ఎదురుచూడ్డం నా వల్ల కావడం లేదు' అంటూ ట్వీట్ చేశాడు నితిన్. గతంలో జరిగిన సంగతులు మనసులో పెట్టుకోకుండా.. మనస్ఫూర్తిగా సినిమా సక్సెస్ ను కోరుకుంటున్న నితిన్ మంచితనం.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.