Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మరీ ఇంత ఘాటుగానా?

By:  Tupaki Desk   |   3 Jan 2018 5:05 AM GMT
ఫోటో స్టోరి: మరీ ఇంత ఘాటుగానా?
X
గత కొంత కాలం నుండి హింది సీరియల్స్ ద్వారా తెలుగు తెరకు చాలా మంది నటీమణులు హీరోయిన్స్ గా పరిచయం అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ తరహాలో మేం వయసుకు వచ్చామ్ అనే సినిమా ద్వారా తెలుగు వెండి తెరకు పరిచయం అయిన బ్యూటీ నితి టైలర్. ఆ సినిమా తెలుగు లవర్స్ ని బాగా ఆకట్టుకుంది. అంతే కాకుండా మంచి కలెక్షన్స్ ని కూడా రాబట్టింది.

నేను లోకల్ దర్శకుడు త్రినాథ రావ్ నక్కిన ఆ సినిమా తోనే మంచి గుర్తింపు అందుకున్నాడు. ఆ సినిమాలో అమ్మడి యాక్టింగ్ కి ఫుల్ మర్క్స్ పడ్డాయి కానీ నెక్స్ట్ అంత పెద్దగా ఆఫర్స్ అందుకోలేదు. పెళ్లి పుస్తకం - లవ్ డట్ కామ్ అనే సినిమాల్లో నటించినా కూడా బిజీ కాలేదు. అయితే మళ్లీ అమ్మడు టీవీ సీరియల్స్ కే షిఫ్ట్ అయ్యింది. పలు రియాలిటీ షోలలో కూడా కనిపిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే.. అమ్మడు చాలా రోజుల తరువాత తెలుగు ఆడియెన్స్ కి కనిపించి షాక్ ఇచ్చింది. అసలు నితి టైలరేనా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మేం వయసుకు వచ్చామ్ సినిమాలో సింపుల్ గా అమాయకపు అమ్మాయిలా కనిపించిన నితి.. బికినీ లో కనిపించడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పక్కన మరో హాట్ బ్యూటీస్ ఉన్నా కూడా నితి సెక్సీ డ్రెస్ అందరిని చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తోంది. అమ్మడు క్యాజువల్ గా ఎంజాయ్ చేస్తూ ఈ స్టిల్ ఇచ్చిందా లేక హాట్ గా కూడా నటిస్తాను అనే విధంగా సినిమా వాళ్లకు హింట్ ఇచ్చిందా అని ఓ వర్గం వారు కామెంట్స్ చేస్తున్నారు.