Begin typing your search above and press return to search.

కాస్టింగ్ కౌచ్ పై నిత్య మీనన్ ఏమందంటే

By:  Tupaki Desk   |   21 March 2018 5:30 PM GMT
కాస్టింగ్ కౌచ్ పై నిత్య మీనన్ ఏమందంటే
X
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి వినడం చాలా మామూలు అయిపోయింది. కానీ హీరోయిన్లు మాత్రం దానిపై పెద్దగా పెదవి విప్పరు. కానీ శ్రీ రెడ్డి అందుకు పూర్తి విరుద్ధం. ఆమె ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ సంగతుల గురించి ధైర్యంగా చెప్పి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆమె బాటలో మరొక స్టార్ హీరోయిన్ జాయిన్ అయ్యింది

శ్రీ రెడ్డి ప్రతి ఛానల్ లోనూ ఇప్పటికైనా అందరూ ముందుకు రావాలి, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు బయటకి చెప్పాలి లేదంటే ఇది ఇక్కడితో ఆగదూ అంటూ బతిమాలిన కేవలం ఒక్క హీరోయిన్ మాత్రమే ముందుకొచ్చింది. ఆమె ఎవరో కాదు నిత్య మీనన్. రియాక్ట్ అయ్యింది అంటే పాజిటివ్ గా చెప్పింది అనుకుంటున్నారేమో. కాదు. కాస్టింగ్ కౌచ్ గురించి ఒక ఇంటర్వ్యూలో అడగగా, అసలు తను ఇప్పటిదాకా అలాంటి పరిస్థితి ఎదురుకోలేదు అని, అలాంటివి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నట్టు కూడా ఎవరినుండీ వినలేదని చెప్పి షాకిచ్చింది.

మొత్తానికి శ్రీ రెడ్డి మాటలు ఎవరు వినలేదు. ఆమె కామెంట్లకు ఎవరూ సపోర్ట్ చేయలేదు అలా అని ఖండించనూలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేము కానీ అందరు స్టార్ హీరోయిన్లు అవి దాటే ఈ స్థాయికి వచ్చారు అనే మాట మాత్రం అబద్దం అనే చెప్పచ్చు. నిత్యా మీనన్ లాగా అలాంటి పరిస్థితిని చూడకుండా కూడా కేవలం టాలెంట్ మీద పైకొచ్చిన హీరోయిన్లే ఎక్కువ.