Begin typing your search above and press return to search.

నేనే మెయిన్ హీరోయిన్ అంటున్న నిత్య‌

By:  Tupaki Desk   |   31 Aug 2016 6:39 AM GMT
నేనే మెయిన్ హీరోయిన్ అంటున్న నిత్య‌
X
జ‌న‌తా గ్యారేజ్‌ లో మెయిన్ హీరోయిన్ ఎవ‌ర‌నేది ఎవ్వ‌రికీ తెలియ‌దు... ఒక్క ఆ సినిమా టీమ్‌ లో కొద్దిమందికి త‌ప్ప‌. కానీ బ‌య‌టి జ‌నాల్ని అడిగితే మాత్రం ఇంకెవ‌రు స‌మంత‌నే క‌దా అంటారు. అదే విష‌యం నిత్య‌మీన‌న్ ద‌గ్గ‌ర చెప్పార‌నుకోండి - `కాదు నేనే మెయిన్ హీరోయిన్` అని చెబుతుంది. స్టార్ల సినిమాలో నిత్య‌మీన‌న్ ఇదివ‌ర‌కు కూడా న‌టించింది. అయితే వాటిలో ఆమె చిన్న పాత్ర‌ల్లో మాత్ర‌మే మెరిసింది. దాంతో `జ‌న‌తా గ్యారేజ్‌`లో కూడా ఆమెకి అదే త‌ర‌హా పాత్రే చేసుంటుందనే ఓ అభిప్రాయంతో ఉన్నారు స‌గ‌టు ప్రేక్ష‌కులు. అయితే నిత్యమీనన్ మాత్రం ఇదివర‌క‌టి సినిమాల్లోలాగా కాకుండా ఇందులో మెయిన్ లీడ్ చేశాన‌ని చెప్పుకొచ్చింది.

``నేను ఎంత మెయిన్ క్యారెక్టర్ చేశానో తెలియ‌డానికి ప్రేక్ష‌కులు సినిమా చూసేంత‌వ‌ర‌కు ఆగాల్సి వ‌స్తోంది. నాది జ‌న‌తా గ్యారేజ్‌ లో మెయిన్ లీడ్‌. చూశాక మీరే షాక‌వుతారు`` అని చెప్పుకొచ్చింది. అయితే సినిమాలో త‌న పాత్ర ఎన్టీఆర్ వ్య‌క్తిత్వాన్ని పోలి ఉంటుంద‌ని - ఎన్టీఆర్ పాత్రేమో త‌న‌ని పోలి ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది నిత్య‌. ఆమెకి ప్ర‌కృతి అంటే చాలా ఇష్ట‌మట‌. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఓ ప్ర‌కృతి ప్రేమికుడిగా క‌నిపిస్తాడు. అయితే నిత్య త‌న పాత్రేంట‌న్న‌ది మాత్రం బ‌య‌ట‌పెట్ట‌డం లేదు. అది తెర‌పై చూసే తెలుసుకోవాలంటోంది. జ‌న‌తా గ్యారేజ్ విష‌యంలో చాలా హ్యాపీగా ఉన్నాన‌నీ - ముఖ్యంగా ఎన్టీఆర్‌ - కొర‌టాల శివ‌ల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం మంచి అనుభూతిని ఇచ్చిందని చెప్పుకొచ్చింది నిత్య‌.