Begin typing your search above and press return to search.

నిత్యా మీనన్.. అదెప్పటి నుంచో?

By:  Tupaki Desk   |   26 Sep 2016 2:13 PM GMT
నిత్యా మీనన్.. అదెప్పటి నుంచో?
X
మల్లూవుడ్ బ్యూటీ నిత్యా మీనన్ బోలెడంత ట్యాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. తన యాక్టింగ్ ప్రతిభతో ఎలాంటి కేరక్టర్ అయినా మెప్పించేసే ఈ బ్యూటీ.. ఆ రోల్ చేయడానికి మాత్రం చాలానే పరిశీలిస్తూ ఉంటుంది. సినిమా సంగతి ఎలా ఉన్నా.. తన పాత్ర విషయంలో మాత్రం కొంచెం కూడా కాంప్రమైజ్ కాని నిత్యామీనన్.. రీసెంట్ గా ఓ షాక్ ఇచ్చిసంది.

సాధారణంగా సినిమాల్లోనూ.. సినిమా ప్రమోషన్స్ లోనూ తప్ప పెద్దగా కనిపించేందుకు ఇష్టపడని నిత్యా మీనన్.. ఇప్పుడు ఓ శారీ మాల్ ఓపెనింగ్ కి హాజరు కావడం చాలామందికి షాక్ కొట్టేట్లు చేసింది. కళామందిర్ సంస్థకు చెందిన 25 వ షోరూం వైజాగ్ లో ప్రారంభించగా.. దీన్ని రిబ్బన్ కటింగ్ కార్యక్రమం నిత్య చేతుల మీదుగానే జరిగింది. డార్క్ ఎల్లో కర్ పట్టు శారీలో.. గోల్డ్ కలర్ లో మెరిసిపోతున్న జాకెట్ తో.. అచ్చ తెలుగు అమ్మాయి మాదిరిగా కనిపించిన నిత్యామీనన్ అందరినీ ఇట్టే ఆకట్టేసుకుంది.

ప్రస్తుతం నిత్యా మీనన్ టైం పీక్స్ లో నడుస్తోందని చెప్పాల్సిందే. తెలుగులో ఈమె ఎన్టీఆర్ తో కలిసి నటించిన జనతా గ్యారేజ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి చూస్తూనే ఉన్నాం. కన్నడలో సుదీప్ తో జోడీ కట్టి నటించిన కోటిగొబ్బ2.. బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇక తమిళంలో విక్రమ్ తో కలిసి ఇరుమగన్ లో నటించగా.. అది 100 కోట్ల వసూళ్లను సాధించేసింది. ఇదే ఏడాది వీటికి ముందు సూర్య 24 మూవీ రిలీజ్ కాగా.. అది కూడా భారీ సక్సెస్ సాధించింది.