Begin typing your search above and press return to search.

పొట్టిదాన్నే..కడుపునిండా తింటా-నిత్యా

By:  Tupaki Desk   |   30 Aug 2016 9:30 AM GMT
పొట్టిదాన్నే..కడుపునిండా తింటా-నిత్యా
X
ఏ మాటైనా ఉన్నదున్నట్లు మాట్లాడేస్తుంది నిత్యా మీనన్. రెగ్యులర్ హీరోయిన్లకు ఉండాల్సిన ఫీచర్లు ఆమెలో కనిపించవు. ఈ విషయంలో ఆమెను చాలామంది విమర్శిస్తుంటారు కూడా. అసలే పొట్టి.. పైగా లావు ఎక్కువ.. ఈమె హీరోయిన్ ఏంటి అనేవాళ్లు లేకపోలేదు. ఐతే అలాంటి విమర్శలు తన చెవిన కూడా పడుతుంటాయని.. కానీ వాటిని తాను పట్టించుకునే ప్రసక్తే లేదని నిత్యా చెప్పింది. తన దృష్టిలో నటనకు మాత్రమే ప్రాధాన్యమని.. తన రూపు రేఖల గురించి ఎవరేమన్నా తనకు అనవసరమని.. ఆ విషయంలో తనకు ఎలాంటి ఆత్మన్యూనతా భావం లేదని ఆమె చెప్పింది.

‘‘ఔను.. నేను పొట్టిగా ఉంటాను. కానీ దాన్ని నేనెప్పుడూ ఓ అనర్హతగా భావించలేదు. పొట్టిగా ఉండటం వల్ల ఉండే అడ్వాంటేజెస్ మీకేం తెలుసు. నాకో చిన్న కుర్చీ ఇచ్చినా సరే.. అందులోనే పడుకుని నిద్రపోగలను. విమానాల్లో ప్రయాణించేటపుడు కూడా శుభ్రంగా నా సీట్లోనూ ముడ్చుకుని నిద్రపోతా. దేవుడు మనకిలా ఇచ్చాడు. దానికి మనం ఫీలవడం దేనికి..? ఇక హీరోయిన్ అనగానే మనకిష్టమైన తిండి మానుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది నన్ను బరువు తగ్గమని.. మరిన్ని అవకాశాలు వస్తాయి కదా అని సలహాలిస్తుంటారు. కానీ నేను నేనుగా ఉండాలని కోరుకుంటా. అవకాశాల కోసం నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే నటన అన్నది ముఖ్యమైన విషయం’’ అని చెప్పింది నిత్య. ఈ మాటలు వింటుంటే.. ఎంతైనా నిత్యామీనన్ నిత్యామీననే అనిపిస్తోంది కదా.