Begin typing your search above and press return to search.

నిత్యా మీనన్ కు ఏమైంది?

By:  Tupaki Desk   |   22 March 2017 6:55 AM GMT
నిత్యా మీనన్ కు ఏమైంది?
X
నిత్యా మీనన్.. తెలుగు సినిమాల్లో సౌందర్య తర్వాత అంత మంచి పేరు తెచ్చుకున్న నటి. ఆమె ఓ సినిమా చేస్తోందంటే.. అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు నమ్మకం పెట్టుకునేంతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది నిత్య. ఐతే దాదాపు ఏడాది నుంచి తెలుగు సినిమాల్లో ఆమె కనిపించకపోవడంతో అభిమానులు తనను మిస్సవుతున్నారు. చివరగా ‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమాలో కనిపించింది నిత్య. దాని తర్వాత తెలుగనే కాదు.. వేరే భాషల్లో కూడా ఆమె కొత్త సినిమాలు అంగీకరించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమెను మెప్పించే కథలు దర్శకులు చెప్పట్లేదా.. లేక ఆమెను ఎవ్వరూ కన్సిడర్ చేయట్లేదా అన్నది అర్థం కాకుండా ఉంది.

ఐతే నిత్య సినిమాలు చేయకపోవడానికి కారణం వేరని తెలుస్తోంది. నిత్య తన దర్శకత్వ కలలు నెరవేర్చుకునే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో కచ్చితంగా దర్శకత్వం చేపడతానని నిత్య ఇంతకుముందే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే అందుకోసం మరీ ఎక్కువ టైం ఏమీ తీసుకోకుండా రంగంలోకి దిగిపోయింది నిత్య. గత కొన్ని నెలలుగా కష్టపడి ఆమె రెండు స్క్రిప్టులు రెడీ చేసిందట. అందులో ఒకదానికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందట. నటీనటులు.. నిర్మాత ఓకే అయిపోయారట. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశముంది. ఈ ఏడాదే నిత్య దర్శకురాలిగా మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరి నటిగా అంత మంచి పేరు తెచ్చుకున్న నిత్య.. దర్శకురాలిగా ఎలాంటి ప్రతిభ చూపిస్తుందో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/