Begin typing your search above and press return to search.

పవన్ ఫ్యాన్ ఒక స్నాప్ వేసుకున్నాడు

By:  Tupaki Desk   |   27 Feb 2017 3:27 PM GMT
పవన్ ఫ్యాన్ ఒక స్నాప్ వేసుకున్నాడు
X
పవన్ కళ్యాణ్‌ సినిమా ఫ్రెటర్నిటీ అతి పెద్ద ఫ్యాన్ ఎవరంటే ముందుగా నితిన్ పేరే వినిపిస్తుంది. అందుకు తగ్గట్లుగానే నితిన్ కూడా వీలైనప్పుడల్లా తన ఫ్యానాభిమానాన్ని తెగ చాటేసుకుంటుంటాడు. మొన్న కాటమరాయుడు టీజర్ వచ్చినప్పుడు రాయుళ్లు అందరూ జరగండి ఇక కాటమరాయుడు వచ్చేశాడు అంటూ కాస్త కాంట్రోవర్షియల్ గా కూడా స్పందించాడు.

ఇకపోతే కాటమరాయుడు లొకేషన్ కు వెళ్ళడమే కాదు.. అక్కడ ఏకంగా రాయుడు అండ్ బ్రదర్స్ తో ఒక స్నాప్ వేసుకున్నా నితిన్. ఒక ప్రక్కన తన సినిమా షూటింగులో బిజీగా ఉన్న నితిన్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ కాటమరాయుడు షూటింగ్ స్పాటుకు వెళ్లి.. అక్కడ తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను నిజం చేసుకున్నాడు. అందరూ కూడా సినిమా గెటప్ లో ఉన్నప్పుడు చక్కగా ఫోటో దిగేశాడు. ఈ సినిమాలో రాయుడుకు తమ్ముళ్ళుగా శివబాలాజీ.. చైతన్య కృష్ణ.. అజయ్.. సాందీప్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆలీ పక్కన లేకుండా పవన్ సినిమాలు ఉండవుగా.

చూస్తుంటే ఈసారి కాటమరాయుడు రిలీజ్ నాడు ఈ నితిన్ ఇంకెంత హడావుడి చేస్తాడో అనిపిస్తోంది. ఇలాంటి అభిమానుల కోసం ఈసారి పవన్ కళ్యాణ్‌ మెగా హిట్ కొట్టాలని ఆశిద్దాం. ఆయన గత చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ డిజప్పాయింట్ చేసిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/