Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో హనుమాన్‌ దీక్ష దేనికోసమో?

By:  Tupaki Desk   |   22 Feb 2019 5:15 PM GMT
స్టార్‌ హీరో హనుమాన్‌ దీక్ష దేనికోసమో?
X
హీరోలు ఎప్పుడు చూసినా చాలా స్టైలిష్‌ లుక్స్‌ తో చాలా ట్రెండీగా కనిపిస్తూ ఉంటారు. అలా కనిపిస్తేనే ప్రేక్షకులు వారిని మరింతగా ఆధరిస్తారు. సినిమాల్లో మరియు బయట కూడా తెలుగు హీరోలు డీ గ్లామర్‌ గా కనిపించేందుకు అస్సలు ఆసక్తి చూపించరు. ఇక హీరోలు రియల్‌ లైఫ్‌ లో పూజలు - దీక్షలు అంటూ బయట ఎక్కువగా కనిపించరు. తెలుగు హీరోల్లో రామ్‌ చరణ్‌ మాత్రమే తరుచుగా అయ్యప్ప దీక్షలో కనిపిస్తూ ఉంటాడు. గత ఏడాది శర్వానంద్‌ కూడా అయ్యప్ప దీక్ష పట్టాడు. ఇక ఇప్పుడు యంగ్‌ స్టార్‌ హీరో నితిన్‌ కూడా దీక్ష పట్టాడు. అయితే ఈయన తీసుకున్నది హనుమాన్‌ దీక్ష.

వరుసగా ఫ్లాప్‌ లు వచ్చిన నేపథ్యంలో తదుపరి చిత్రం విషయంలో కాస్త ఆలోచనలో పడ్డ నితిన్‌ ఇప్పటికే ప్రారంభించాల్సిన 'భీష్మ' చిత్రాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. భీష్మ చిత్రం షూటింగ్‌ కు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో ఈ గ్యాప్‌ లో ప్రశాంతత కోసం అంటూ హనుమాన్‌ దీక్షను తీసుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

నితిన్‌ ఆంజనేయ స్వామి భక్తుడు. ఆ భక్తితోనే ఇప్పుడు హనుమాన్‌ దీక్ష తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రెగ్యులర్‌ సెలబ్రెటీ జీవితానికి దూరంగా, సిటీకి దూరంగా కొన్ని రోజుల పాటు ఆంజనేయ స్వామి పూజలోనే నితిన్‌ తరించబోతున్నట్లుగా తెలుస్తోంది. నితిన్‌ దీక్ష తీసుకున్న ఫొటోలు అయితే బయటకు రాలేదు. కాని ఆయన సన్నిహితులు మీడియాకు అనఫిషియల్‌ గా చెబుతున్నారు. నితిన్‌ దీక్షతో అయినా సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కుతాడో చూడాలి.