Begin typing your search above and press return to search.

నితిన్ గుండె రెండోసారి జారలేదంట!!

By:  Tupaki Desk   |   27 May 2016 1:34 PM GMT
నితిన్ గుండె రెండోసారి జారలేదంట!!
X
విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నితిన్ చేసిన మూవీ గుండె జారి గల్లంతయ్యిందే. వరుస ఫ్లాపుల తర్వాత ఇష్క్ తో హిట్ కొట్టిన నితిన్ కి.. వెంటనే మరో సక్సెస్ అందించాడు ఈ దర్శకుడు. నితిన్ తో సినిమా తర్వాత.. ఈ డైరెక్టర్ అక్కినేని నాగచైతన్యతో ఒక లైలా కోసం చేసినా.. సక్సెస్ సాధించలేకపోయాడు. అయితే.. నితిన్ తో మరోమారు మ్యాజిక్ చేయాలనే ఆలోచన.. విజయ్ కుమార్ కొండాకు ఉంది.

గుండె జారి గల్లంతయ్యిందే చిత్రానికి సీక్వెల్ తీసేందుకు ట్రై చేస్తున్నాడు. యంగ్ హీరో నితిన్ తో ఇప్పటికే స్క్రిప్ట్ కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. స్టోరీ డిస్కషన్స్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీపై.. నితిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేసిన అ..ఆ.. చిత్రానికి గాను.. ప్రమోషన్స్ చేపట్టిన నితిన్.. తన తర్వాతి ప్రాజెక్టుల గురించి అడిగినప్పుడు.. ఈ సీక్వెల్ సంగతి కూడా చెప్పాడు.

'గుండెజారి గల్లంతయ్యిందే సినిమాకు సీక్వెల్ చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఫస్టాఫ్ స్క్రిప్ట్ వర్క్ మాత్రమే పూర్తయింది. సెకండాఫ్ కూడా బాగా నచ్చితేనే మూవీ చేస్తాను. ఫస్ట్ ఫార్ట్ పెద్ద హిట్ అయింది. ఇలాంటి సమయంలో సీక్వెల్ పై అంచనాలు ఎక్కువగా ఉంటాాయి. అందుకే స్క్రిప్ట్ బాగా వస్తే చేస్తా.. లేకుంటే లేదు' అంటూ చెప్పాడు నితిన్.