Begin typing your search above and press return to search.

అసలు నితిన్‌ కు వాళ్లకూ గొడవేలేదు

By:  Tupaki Desk   |   6 May 2016 12:02 PM GMT
అసలు నితిన్‌ కు వాళ్లకూ గొడవేలేదు
X
సూర్య త్రిపాత్రిభినయం చేసిన 24 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రిపోర్టులే వస్తున్నాయి. విభిన్నమైన పాయింట్ తో సినిమా తీశాడంటూ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ప్రశంసలు వస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కూడా 24 టీం ను అభినందిస్తూ ట్వీట్ చేశాడు.

'టీం 24కు కంగ్రాట్స్. ఈ సినిమా గురించి అద్భుతమైన స్పందన వినిపిస్తోంది. మాస్టర్ పీస్ లాంటి ఈ మూవీతో శ్రేష్ఠ్ మూవీస్ కూడా భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉంది. విక్రమ్ - సూర్యలకు థాంక్యూ'.. ఇదీ నితిన్ చేసిన ట్వీట్. ఈ ట్వీట్ చూస్తే.. ఓ విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది. 24ను అభినందించడంతోపాటే.. ఈ మూవీలో తన హోం బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ కూడా ఒక భాగం అని డైరెక్టుగానే చెప్పాడు నితిన్. కొన్నాళ్ల నుంచి టాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది. 24 మూవీ తెలుగు వెర్షన్ రైట్స్ తమకు ఇవ్వకుండా.. స్టూడియో గ్రీన్ ద్వారా సూర్య సొంతగా రిలీజ్ చేసుకుంటున్నాడని అన్నారు.

అందుకు తగ్గట్లుగానే ఆ సంస్థ కూడా యాక్టివ్ గా కనిపించింది. దీనికి తోడు తన అ..ఆ.. రిలీజ్ కి అడ్డం పడ్డందుకు కూడా నితిన్ అలిగినట్లుగా వార్తలొచ్చాయి. కానీ 24 రిలీజ్ కు ముందు, విడుదల తర్వాత కూడా నితిన్ ట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు. దీనికి కారణం ఇప్పుడు నితిన్ స్వయంగానే చెప్పేశాడు. 24 తెలుగుకు సంబంధించి నితిన్ కి వాటా ఉందనే విషయం ఇప్పుడు తేలిపోయింది.