Begin typing your search above and press return to search.

అఆ.. మ‌ధ్య‌లో క‌మెడియ‌న్‌

By:  Tupaki Desk   |   27 Nov 2015 12:30 PM GMT
అఆ.. మ‌ధ్య‌లో క‌మెడియ‌న్‌
X
సినిమా స్టిల్స్ అంత ఆషామాషీగా బ‌య‌టికి రావు. సినిమా ఫ్లేవ‌ర్ ఏంటో తెలిసిపోతుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆచితూచి స్టిల్స్ విడుద‌ల చేస్తుంటారు. వాటిని కూడా మంచి హైప్‌ తో ఫ‌స్ట్ లుక్‌ - సెకండ్ లుక్ అంటూ ప్రేక్ష‌కుల్ని ఊరిస్తూ విడుద‌ల చేస్తుంటారు. అయితే స్మార్ట్ ఫోన్లు - సోష‌ల్ నెట్‌ వ‌ర్కింగ్ సైట్లు అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌ట్నుంచి ద‌ర్శ‌క‌నిర్మాత‌ల అభిప్రాయంతో సంబంధం లేకుండా యాక్ట‌ర్లే సెట్‌ లో సెల్ఫీల‌నీ, అవ‌నీ ఇవ‌నీ ర‌క‌ర‌కాలుగా ఫొటోలు తీసుకొని వాటిని సోష‌ల్ నెట్‌ వ‌ర్కింగ్ సైట్ల‌లో పెడుతున్నారు. దీంతో ముందుగానే స్టిల్స్ బ‌య‌టికొచ్చేస్తున్నాయి. ఇటీవ‌ల‌కాలంలో అలా చాలామంది తార‌లు సెట్‌ లో ఫొటోలు తీసుకొని నెట్‌ లో పెట్టారు. అయితే రాజ‌మౌళిలాంటి ద‌ర్శ‌కుడు మాత్రం తాను తీసేది భారీ సినిమాలు కాబ‌ట్టి అందులో సెట్లు బ‌య‌టికి రాకూడ‌దు కాబ‌ట్టి అస‌లు సెల్‌ ఫోన్‌ ల‌కి అనుమ‌తివ్వ‌కుండా షూటింగ్ చేసేస్తుంటాడు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే ఇటీవ‌ల త్రివిక్ర‌మ్ సినిమాలోని ఓ స్టిల్ బ‌య‌టికొచ్చింది కాబ‌ట్టి. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వంలో నితిన్ క‌థానాయ‌కుడిగా అఆ పేరుతో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. అందులో స‌మంత క‌థానాయిక‌. సెట్‌ పైకి వెళ్లిన‌ప్ప‌ట్నుంచి ఆ సినిమా గురించిన కొత్త సంగ‌తులేవీ బ‌య‌టికి రాలేదు. అయితే తాజాగా నితిన్‌ - స‌మంత‌ - హ‌స్య‌న‌టుడు ప్ర‌వీణ్‌ ల‌తో కూడిన ఓ స్టిల్ బ‌య‌టికొచ్చింది. అది సోష‌ల్ నెట్‌ వ‌ర్కింగ్ సైట్ల‌లో హ‌ల్‌ చ‌ల్‌ చేస్తోంది. చిత్ర‌బృందం తీసిన ఫొటోనో లేదంటే వేరే తార‌లెవ‌రైనా తీసి ఆన్‌ లైన్‌ లో పెట్టారో తెలియ‌దు కానీ నెటిజ‌న్ల‌ను మాత్రం ఆ ఫొటో బాగా ఆక‌ట్టుకుంటోంది. అటు నితిన్‌.. ఇటు స‌మంత మ‌ధ్య‌లో క‌మెడియ‌న్ ప్ర‌వీణ్ కూర్చుని ముచ్చ‌ట్లు చెప్పుకుంటున్న ఫొటో అది. మ‌రి సన్నివేశాల్లో భాగంగా అలా కూర్చున్నారో లేక పిచ్చాపాటిగా మాట్లాడుతున్నారో తెలియ‌దు కానీ మీరు మాత్రం ఇటు ఓ లుక్కేయండి.