నితిన్ కు గుర్తుండే శీతాకాలం

Wed Dec 13 2017 09:23:03 GMT+0530 (IST)


‘అ..ఆ’ సినిమాలో కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించాడు హీరో నితిన్. ఈ సినిమా హిట్ ఇచ్చిన ఎనర్జీతో భారీ బడ్జెట్ తో లై తీశారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ చేదు అనుభవం నుంచి బయటకు వచ్చేందుకు తనకు బాగా పేరు తెచ్చిన రొమాంటిక్ ఎంటర్ టెయినర్ జోనర్ లో లేటెస్ట్ సినిమా చేస్తున్నాడు.ప్రస్తుతం నితిన్ పాటల రచయిత కృష్ణ చైతన్య డైరెక్షన్ లో లేటెస్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి మూలకథ అందించాడు. నితిన్ సొంతమైన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్టయి జోరుగా సాగుతోంది. నితిన్ అమితంగా అభిమానించే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సహనిర్మాత కావడం విశేషం. కాస్త కవితాత్మకంగా ఉన్న గుర్తుందా శీతాకాలం టైటిల్ లోనే త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తోందని అభిమానులు అంటున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టెయినర్ ను వేసవికన్నా ముందే థియేటర్లకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

గుర్తుందా శీతాకాలంలో హీరోయిన్ గా మేఘా ఆకాష్ నటిస్తోంది. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి లై సినిమాలో నటించారు. ఆ సినిమా హిట్టవకపోయినా ఈ జంట మాత్రం బాగానే ఆకట్టుకుంది. లై సినిమాలో చాలాభాగం అమెరికాలోః షూట్ చేశారు. ఇప్పుడు గుర్తుందా శీతాకాలం సినిమాలో  కూడా మేజర్ పార్ట్ యూఎస్ లోనే తీస్తుండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం.