Begin typing your search above and press return to search.

నితిన్ సినిమా.. ఇంకాస్త క్లారిటీ

By:  Tupaki Desk   |   26 Nov 2015 11:30 AM GMT
నితిన్ సినిమా.. ఇంకాస్త క్లారిటీ
X
ఇష్క్ - గుండెజారి గల్లంతయ్యిందే - హార్ట్ అటాక్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి ఊపు మీదున్న నితిన్ కు ‘చిన్నదాన నీకోసం’ పెద్ద బ్రేక్ వేసింది. మళ్లీ ఇంకో సినిమా మొదలుపెట్టడానికి దాదాపు ఏడాది టైం తీసుకున్నాడు నితిన్. ఐతే ఈ ఖాళీ అతడికి మంచే చేసింది. త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ తో పని చేసే ఛాన్స్ కొట్టేశాడు నితిన్. ప్రస్తుతం వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘అ.. ఆ’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫిబ్రవరికల్లా ఈ సినిమా పూర్తయిపోతుంది. తర్వాత వెంటనే తన తర్వాతి సినిమా కూడా మొదలుపెట్టేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు నితిన్.

మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడు రూపొందించే ఈ సినిమాను నితిన్ సొంత నిర్మాణ సంస్థ ‘శ్రేష్ఠ్ మూవీస్’ నిర్మిస్తుంది. లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య మాటలు అందిస్తాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్నందిస్తాడు. ఈ సినిమాలో నితిన్ సరసన ఓ హీరోయిన్‌ గా రకుల్ ను ఇప్పటికే ఎంపిక చేస్తారు. ఇంకో హీరోయిన్ కోసం కొన్నళ్లుగా వేట సాగుతోంది. చాలామందిని పరిశీలించి సెకండ్ హీరోయిన్ గా బాగా అనుభవమున్న ప్రణీత సుభాష్ ను ఎంపిక చేశారు. ‘డైనమైట్’తో డల్ అయిపోయిన ప్రణీత.. ప్రస్తుతం మహేష్ సరసన ‘బ్రహ్మోత్సవం’లో చిన్న పాత్ర చేస్తోంది. నితిన్ సినిమాలో ఆమెది కీలక పాత్రేనని సమాచారం.