Begin typing your search above and press return to search.

ఆ విషయంలో నితిన్ స్ట్రాంగ్

By:  Tupaki Desk   |   17 March 2018 4:10 AM GMT
ఆ విషయంలో నితిన్ స్ట్రాంగ్
X
వరసగా నాలుగైదు ఫ్లాపులు కొడితే ఇండస్ట్రీలో ఫేడవుట్ అవడం.. అవకాశాలు తగ్గిపోవడం చాలా సహజం. కానీ పదేళ్లపాటు హిట్ అన్నది చూడకుండా.. వరస ఫ్లాపులతోనే కాలం నెట్టుకుంటూ వచ్చాడు హీరో నితిన్. విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఇష్క్ సినిమా నుంచి అతడి కెరీర్ యు టర్న్ తీసుకుంది. ఇంత లాంగ్ టైమ్ స్ట్రగుల్స్ ఎదుర్కొన్న యంగ్ హీరో నితిన్ ఒక్కడే.

వరస ఫెయిల్యూర్లు తనకు ఎన్నో పాఠాలు నేర్పాయని అంటున్నాడు నితిన్. ‘‘ఆ టైంలో అసలు ఎలాంటి సినిమాలు చేస్తే ఆడతాయో అస్సలు అర్ధం కాలేదు. ఏ రకమైన స్క్రిప్టులు నాకు సూటవుతాయో తెలియలేదు. రకరకాల జోనర్లలో ప్రయోగాలు చేసుకుంటూ పోయానంతే. కానీ వాటిల్లో ఏదీ నాకు సెట్టవలేదు. అన్ని ప్రయోగాలు నెగిటివ్ రిజల్ట్ నే ఇచ్చాయి. దీంతో చాలా అసంతృప్తికి గురయ్యా. కానీ ఏదో రోజు బౌన్స్ బ్యాక్ అవుతానన్న నమ్మకం నాకుండేది. నేను మానసికంగా చాలా స్ట్రాంగ్. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఓపిగ్గా నా ప్రయత్నం చేస్తూనే వచ్చా. అదే నన్ను నిలబెట్టింది’’ అని తన విజయ రహస్యం చెప్పుకొచ్చాడు నితిన్.

రీసెంట్ గా నితిన్ హీరోగా భారీ బడ్జెట్ తో తీసిన యాక్షన్ బేస్ డ్ మూవీ లై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో మరోసారి తనకు కలిసొచ్చిన రొమాంటిక్ ఎంటర్ టెయినర్ జోనర్ లో చల్ మోహనరంగ సినిమా చేశాడు. లై సినిమాతో నితిన్ కు జంటగా నటించిన మేఘా ఆకాష్ ఇందులో కూడా హీరోయిన్ గా నటించింది. వచ్చేనెలలో ఈ మూవీ థియేటర్లకు రానుంది. దీంతోపాటు సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో దిల్ రాజు బ్యానర్ లో శ్రీనివాస కళ్యాణంలో సినిమా కూడా చేస్తున్నాడు.