Begin typing your search above and press return to search.

అరుదైన ఫీట్ సాధించిన నితిన్

By:  Tupaki Desk   |   1 Aug 2015 4:11 AM GMT
అరుదైన ఫీట్ సాధించిన నితిన్
X
గజినీ మొహమ్మద్ దండయాత్రని తలపించేలా వరుసపెట్టి 14ఫ్లాపుల తరువాత హిట్ల బాట పట్టిన యువహీరో నితిన్ కెరీర్ నేటి యువహీరోలకు ఆదర్శప్రాయం. ఇష్క్ తో తన పూర్వపు ఫామ్ ని పునికిపుచ్చుకున్న ఈ యువ హీరో ఆ తరువాత ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు. అయితే నితిన్ తాజా ప్రాజెక్ట్ తో ఒక అరుదైన ఫీట్ ని సాధించాడు. ఆ ఫీట్ ఇప్పటి అగ్రహీరోలైన పవన్, మహేష్, తారక్ లు కూడా సాధించకపోవడం విశేషం.

ఇంతకీ అదేమిటంటే టాలీవుడ్ అగ్రదర్శకులైన రాజమౌళి, త్రివిక్రమ్, వినాయక్, పూరిలతో పనిచేసిన ఏకైక హీరో నితిన్ కావడం. త్రివిక్రమ్ తో నితిన్ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్న విషయం తెలిసినదే. వీరేకాక కృష్ణవంశీ, రామ్ గోపాల్ వర్మ వంటి క్రియేటివ్ డైరెక్టర్స్ కి కూడా నితిన్ హీరోగా నచ్చడం గమనార్హం. పవన్, మహేష్ వంటి అగ్రహీరోలు కూడా ఈ రికార్డుని ఇప్పట్లో చెరపలేరని ఒక వాదన. వెల్ డన్ నితిన్.