ప్లాప్ డైరెక్టర్ వెనుక పడ్డారేంటబ్బా ?

Thu Mar 21 2019 17:51:14 GMT+0530 (IST)

సినిమా పరిశ్రమలో ఎవరికైనా సక్సెస్ తర్వాతే ఏదైనా. జాలి కరుణల మీద అవకాశాలు దక్కడం అరుదు. ఒక్కోసారి ట్రాక్ రికార్డు సంతృప్తికరంగా లేకపోయినా టైం కలిసి వచ్చినప్పుడు ఛాన్సులు క్యూ కడతాయి. ఇప్పుడు దర్శకుడు రమేష్ వర్మ పరిస్థితి అలాగే ఉంది. తమిళ్ బ్లాక్ బస్టర్ రట్ససన్ రీమేక్ కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో బిజీగా ఉన్న ఇతను నితిన్ తో ఓ ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. ఈ రెండు సినిమాలకు నిర్మాత కోనేరు సత్యనారాయణ నిర్మాత కావడం గమనార్హం. అయితే నిజంగా నితిన్ ఓకే చెప్పాడా లేదా అనేది కన్ఫర్మ్ కావాల్సి ఉందినితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ(వర్కింగ్ టైటిల్) ప్రారంభం కోసం వెయిట్ చేస్తున్నాడు. దీని తర్వాతే ఇది ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ వీటి మధ్యలో సూర్య ప్రతాప్ దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యాడు నితిన్. ఇది గీతా బ్యానర్ 2 లోనే రూపొందాల్సి ఉంది.

శ్రీనివాస కళ్యాణం తర్వాత ఏకంగా ఆరు నెలల గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడిలా వరసగా క్రేజీ డైరెక్టర్స్ తో కాక రిస్కులకు సైతం సిద్ధ పడటం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే రమేష్ వర్మ నితిన్ ను ఒప్పించిన కథ రట్ససన్ కు ముందు చెప్పిన కథా లేక వేరేదా అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు. వెంకీ కుడుముల సినిమా ఇప్పటికే మూడు నెలలు ఆలస్యమయింది. వీలైనంత త్వరగా పూర్తి చేస్తే మిగిలినవి లైన్ లోకి వస్తాయి