Begin typing your search above and press return to search.

ఈసారి పవన్‌ లక్‌ తెస్తాడా??

By:  Tupaki Desk   |   30 April 2016 1:30 PM GMT
ఈసారి పవన్‌ లక్‌ తెస్తాడా??
X
ఎప్పుడూ పవన్‌ కళ్యాణ్‌ ను నమ్ముకుంటే లక్‌ వస్తుందా? అంత సీన్‌ లేదు. ఆ విషయం హీరో నితిన్‌ కు కూడా తెలుసు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌ మనోడి గత సినిమా ''చిన్నాదానా నీకోసం'' అనే చెప్పాలి. ఆ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్‌ అంటూ.. ఏకంగా పవన్‌ బొమ్మను పేపర్‌ మీద అచ్చుగుద్దినట్లు గీసేస్తుంటాడు నితిన్‌. మనస్సులో అభిమానం ఉంటే అలా గీసేయొచ్చని కూడా సెలవిస్తాడు. కాని ఆ జిమ్ముక్కులేవీ సినిమా ఫేట్‌ ను మార్చలేదు. అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.

సో.. పవన్‌ కళ్యాణ్‌ ఆడియోకు వస్తేనో.. పవన్‌ ను సినిమాలో స్థుతిస్తేనో.. సినిమా మాత్రం ఆడదు. కాని నితిన్‌ మాత్రం ఇప్పుడు ''అ..ఆ'' సినిమా ఆడియో లాంచ్‌ కు పవన్‌ ను చీఫ్‌ గెస్టుగా పిలిచాడు కాబట్టి.. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకంతోనే ఉన్నాడట. మరి పవన్‌ ఇప్పుడు నితిన్‌ కు ఎటువంటి లక్‌ ను ఇస్తాడనేది అందరూ ఎదురుచూస్తున్న విషయం. ఇంకో విషయం ఏంటంటే.. అ..ఆ సినిమా రిలీజయ్యేవరకు అసలు నితిన్‌ తన తదుపరి సినిమా ఏదీ సైన్‌ చేయట్లేదట. ఆ సినిమా రిజల్టు తరువాతనే మనోడు కొత్త సినిమా మొదలుపెడతాడట.

ఇకపోతే బ్రహ్మోత్సవం సినిమాను మే 27న అనుకుంటున్నారట. అందుకే ఇప్పుడు నితిన్‌ తన సినిమాను మే 11 లేదా 12న దించితే ఎలా ఉంటుందని చూస్తున్నాడు. ఈ రిలీజ్‌ డేట్‌ విషయం మే 2న ఆడియో లాంచ్‌ నాడు కన్ఫామ్‌ చేసే ఛాన్సుంది.