Begin typing your search above and press return to search.

ఆ హీరో ఎవరో మీకు తెలుసుకదండీ!!

By:  Tupaki Desk   |   27 May 2016 9:50 AM GMT
ఆ హీరో ఎవరో మీకు తెలుసుకదండీ!!
X
సమంత మెడలో ఒక లాకెట్‌. అది 'ఎన్' అనే అక్షరం. ఈ లాకెట్‌ చాలా స్పెషల్ అని కొంతమందికి తట్టింది. ఇంతలోనే ఆ లాకెట్ స్పెషల్ అంటూ సమంతకు కూడా అనిపించింది. అందుకే దాని గురించి పబ్లిక్‌ గా ట్విట్టర్ లోనే పెట్టింది. ఇదంతా మనకు తెలిసిన కథే.

మ్యాటర్‌ లోకి వెళితే.. ఇవాళ ''అ..ఆ'' సినిమాను ప్రమోట్‌ చేయడానికి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు నితిన్‌. ఈ సందర్భంగా మనోడ్ని ఊహించని ప్రశ్నలు కొన్ని ఢీ కొట్టాయ్‌. సమంత ప్రియుడు ఎవరో యంగ్‌ హీరో అంట కదా.. అదెవరో మీకు తెలుసా? అని అడిగారు మీడియా వారు. అబ్బే నన్ను ఆ విషయాల్లోకి లాగొద్దు మాష్టారూ.. మీరు ఏమన్నా ఉంటే సమంతనే అడగండి అంటూ మనోడు సెలవిచ్చాడు. ''అసలు సమంత నాతో తన పర్సనల్ విషయాలు ఏమీ డిస్కస్‌ చేయదు. చాలా ప్రొఫెషనల్‌. కేవలం సినిమా గురించి మా చర్చలన్నీ'' అన్నాడు నితిన్‌.

ఇప్పుడు ఒక మీడియా వ్యక్తికి మరో డౌటు వచ్చింది. అసలు 'ఎన్‌' అంటే నితిన్‌ కూడా అయ్యుండొచ్చుగా? ఇదే విషయాన్ని అడిగితే.. అయ్యా ఇది టూ మచ్ అంటున్నాడు నితిన్‌. ఆఖరిలో ముగిస్తూ.. ''ఆ హీరో ఎవరో మీకు తెలుసుకదండీ.. ఎందుకు నన్ను అడగటం'' అంటూ ముగించేశాడు.

ఇక ''అ..ఆ'' సినిమా మాత్రం తన కెరియర్‌ లో బెస్ట్ ఫిలిం అంటూ సెలవిచ్చాడు నితిన్‌. అది సంగతి.