Begin typing your search above and press return to search.

కుర్ర హీరోలకు జూన్ అంకితం

By:  Tupaki Desk   |   24 May 2016 5:16 AM GMT
కుర్ర హీరోలకు జూన్ అంకితం
X
సమ్మర్ సీజన్ పూర్తయిపోతోంది. ఈ ఎండాకాలం అంతా బడా హీరోలు తమ సినిమాలతో తెగ సందడి చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సరైనోడుతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - బ్రహ్మోత్సవంతో సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్లకు వచ్చారు. మధ్యలో కోలీవుడ్ హీరో సూర్య 24 - సాయిధరం తేజ్ సుప్రీమ్ కూడా రిలీజ్ అయినా.. సమ్మర్ మొత్తం ప్రధానంగా బడా హీరోలకే సరిపోయింది.

ఇప్పుడు జూన్ నెల వచ్చేస్తోంది. ఈ నెలలో ముగ్గురు కుర్ర హీరోలు సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. అందులో మొదటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ సమంత జంటగా నటించిన అ..ఆ.. జూన్ 2న విడుదల అవుతోంది. మాటల మాంత్రికుడి మూవీ కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. పైగా పెట్టిన బడ్జెట్ ని రికవర్ చేసుకోవాలంటే.. నితిన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కంటే రెట్టింపు కలెక్షన్స్ ను రాబట్టాల్సి ఉంటుంది.

జూన్ 10న 'రైట్ రైట్' మూవీతో సుమంత్ అశ్విన్ ప్రేక్షకుల ముందు రానున్నాడు. మను దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో పూజా జవేరి హీరోయిన్ గా నటించగా.. బాహుబలిలో కాలకేయుడుగా నటించిన ప్రభాకర్ పాజిటివ్ రోల్ చేస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. ఇక జూన్ 17న ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో జెంటిల్మన్ గా వస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. భలే భలే మగాడివోయ్ బ్లాక్ బస్టర్ తర్వాత..కృష్ణగాడి వీర ప్రేమగాధ యావరేజ్ గా నిలవడంతో.. జెంటిల్మన్ మూవీతో సత్తా చాటాల్సిన అవసరం నానికి ఉంది. మొత్తం మీద జూన్ మొత్తాన్ని కుర్ర హీరోలు కాప్చర్ చేసేస్తున్నారని చెప్పచ్చు.