Begin typing your search above and press return to search.

ఈ కాంబో సెట్ అవుతుందా?

By:  Tupaki Desk   |   24 Aug 2017 5:29 AM GMT
ఈ కాంబో సెట్ అవుతుందా?
X
సినిమాల్లో ఎలాంటివారినైనా పరాజయాలు పలకరిస్తూనే ఉంటాయి. విజయాలు హాయ్ చెబుతూనే ఉంటాయి. సినిమా జీవితంలో ఈ తరహాలో పరిస్థితులను ఎదుర్కోవడం చాలా కామన్. కానీ ప్రస్తుత రోజుల్లో ఎంతటివారైనా ఒక్క ప్లాప్ అందుకుంటే నెక్స్ట్ సినిమాపై ఆ ప్రభావం చాలానే ఉంటుంది. ఎలాగైనా ఆ సినిమా తరువాత హిట్ కొట్టాలని హిట్ దర్శకుడితో సినిమా తియ్యాలని ఒక హీరో అనుకుంటాడు. అలాగే ప్రస్తుతం ఓ రేంజ్ లో ఉన్న హీరోతో సినిమా తియ్యాలని అప్పుడే ఫ్లాప్ చవిచూసిన దర్శకుడు కూడా అనుకుంటాడు.

అయితే అందుకు భిన్నంగా పరాజయాలను అందుకున్న ఇద్దరి కాంబో లో ఒక సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. వారు ఎవరో కాదు. హీరో నితిన్ మరియు దర్శకుడు సంపత్ నంది. రీసెంట్ గా ఈ ఇద్దరు ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి ప్రతిష్టాత్మక చిత్రాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కించిన నితిన్ "లై" సినిమాతో బిగ్గెస్ట్ ప్లాప్ ని అందుకోగా.. సంపత్ నంది - గోపీచంద్ తో తెరకెక్కించిన "గౌతమ్ నంద" ఊహించని డిజాస్టర్ ని ఇచ్చింది.

అయితే మొదట గౌతమ్ నంద స్టోరిని నితిన్ కె వినిపించాడట సంపత్ కానీ అప్పుడు నితిన్ కి కుదరక ఓకె చేయలేకపోయాడట. కానీ రీసెంట్ గా ఓ కథ చెప్పడంతో ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్.. పవన్-త్రివిక్రమ్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత కె. రాధామోహన్ తో ఓ సినిమా చేయాలి. ఆ సినిమా తప్పకుండా సంపత్ డైరక్షన్లోనే అయ్యి ఉంటుందని టాక్. చూడాలి మరి ఈ కాంబో ఎంతో వరకు హెల్ప్ అవుతుందో వారికి. లెటజ్ సీ!!