Begin typing your search above and press return to search.

నితిన్ అతడికి ఓకే చెప్పేశాడు

By:  Tupaki Desk   |   3 Sep 2015 4:41 PM GMT
నితిన్ అతడికి ఓకే చెప్పేశాడు
X
హ్యాట్రిక్ హిట్లు కొట్టాక నితిన్ చేసిన 'చిన్నదాన నీకోసం' ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అదే సమయంలో అతడికి అనుకోకుండా గ్యాప్ వచ్చేసింది. దాదాపు 8 నెలల నుంచి ఖాళీగా ఉన్నాడు నితిన్. గ్యాప్ వస్తే వచ్చింది కానీ.. నితిన్ కెరీర్ మళ్లీ ఒక్కసారిగా స్పీడందుకోబోతోంది. త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ తో త్వరలోనే సినిమా మొదలుపెట్టబోతున్నాడీ యంగ్ హీరో. ఈ సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మరోవైపు వేణు మల్లిడి అనే కొత్త దర్శకుడితోనూ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్రివిక్రమ్ సినిమా మధ్యలో ఉండగానే ఈ సినిమా మొదలవుతుందని సమాచారం. తాజాగా నితిన్ ఇంకో సినిమాకు ఓకే చెప్పాడు.

లిరిసిస్ట్ గా కెరీర్ ఆరంభించి.. 'రౌడీఫెలో'తో దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్య నితిన్ తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కొన్నాళ్ల కిందటే వార్తలొచ్చాయి. ఐతే ఇటీవలే కృష్ణ చైతన్య కథకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రేమ నేపథ్యంలో సాగే యాక్షన్ కథ ఇదని తెలిసింది. ప్రస్తుతం నితిన్ చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్తయ్యాక ఈ సినిమా మొదలవుతుంది. నితిన్ ఖాళీ అవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఆలోపు స్క్రిప్టును మరింత పక్కాగా సిద్ధం చేయాలని భావిస్తున్నాడు కృష్ణచైతన్య. ఈ సినిమాను నితిన్ స్వయంగా నిర్మిస్తాడా.. వేరే నిర్మాతతో చేస్తాడా అన్నది తెలియలేదు. కృష్ణచైతన్య.. నితిన్ సూపర్ హిట్ సినిమాలు ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందేలో పాటలు రాశాడు. ఆ సమయంలో ఇద్దరూ క్లోజ్ అయ్యారు. 'రౌడీ ఫెలో'తో దర్శకుడిగా మంచి మార్కులేయించుకున్నప్పటికీ కమర్షియల్ గా పెద్ద సక్సెస్ సాధించలేకపోయాడు కృష్ణచైతన్య. మరి రెండో సినిమాతో ఆ లోటు కూడా తీరిపోతుందేమో చూడాలి.