Begin typing your search above and press return to search.

అక్కడ పెద్ద షెడ్యూల్ వేసుకున్న నితిన్

By:  Tupaki Desk   |   25 March 2017 7:14 AM GMT
అక్కడ పెద్ద షెడ్యూల్ వేసుకున్న నితిన్
X
అ..ఆ.. మూవీ సక్సెస్ తర్వాత.. తన నెక్ట్స్ మూవీ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు నితిన్. మరుసటి చిత్రంతో కూడా ఆ స్థాయి విజయం నమోదు చేయాలన్నది నితిన్ ఉద్దేశ్యం. బాగా గ్యాప్ తీసుకున్నా.. హను రాఘవపూడి దర్శకత్వంలో మూవీ స్టార్ట్ చేసిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు అమెరికా బాట పడుతున్నాడు.

ఇండియాలో జరిగిన షెడ్యూల్ తో ఇక్కడి షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందని తెలుస్తోంది. ఇప్పుడు మొత్తం యూనిట్ అంతా అమెరికా బాట పట్టేశారు. హీరో నితిన్.. హీరోయిన్ మేఘా ఆకాష్.. ప్రధాన పాత్రధారులైన అర్జున్.. శ్రీరాంలతో పాటు ఇతర నటీనటులు.. సాంకేతిక వర్గం అంతా అమెరికా వెళ్లనున్నారు. ఇంత మంది వెళుతున్నారంటే.. ఇది పెద్ద షెడ్యూల్ అనే సంగతి అర్ధమవుతుంది. ఏకంగా 2 నెలలకు పైగా యూఎస్ లో షూటింగ్ చేయబోతున్నారు.

అమెరికాలో ఇంత సుదీర్ఘమైన షెడ్యూల్ షూటింగ్ చేయడం.. ఈ మధ్య కాలంలో ఓ తెలుగు సినిమాకు ఇదే మొదటి సారి అంటోంది యూనిట్. యూఎస్ఏ నుంచి ఇండియాకి వచ్చిన ఓ కుర్రాడి కథే నితిన్ నటించిన ఈ సినిమా స్టోరీ. జూలై నాటికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/