లై శాటిలైట్.. స్టయిలిష్ ఎఫెక్ట్ వలనే

Mon Jul 17 2017 13:43:58 GMT+0530 (IST)

తన కెరీర్లోనే బెస్ట్ హిట్టయిన ‘అ.. ఆ’ సినిమా తర్వాత నితిన్ ఆచితూచి అడుగులేస్తున్నాడు.  ఆ సినిమా హిట్ తో వచ్చిన ఇమేజ్ కాపాడుకోవడంతో పాటు తన మార్కెట్ పెంచుకునే సినిమా చేయాలని బాగా గ్యాప్ తీసుకున్నాడు. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా డైరెక్టర్ హను రాఘవపూడితో 'లై' సినిమాకు శ్రీకారం చుట్టాడు.

నితిన్ కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో రూ. 40 కోట్ల వ్యయంతో లై సినిమా తీస్తున్నారట. ఈ సినిమాలో అత్యధిక భాగం యూఎస్ లోనే షూట్ చేశారు. యాక్షన్ హీరో అర్జున్ కీలక పాత్రలో కనిపిస్తాడు. లై అంటే అబద్ధంతోపాటు లవ్ - ఇంటలిజెన్స్ - ఎనిమిటీ అనే కొత్త అర్ధాన్ని కూడా టైటిల్ లోనే చెప్పారు. ఇందులో నితిన్ లుక్ కూడా అదిరిపోయింది. దీనికితోడు ఇటీవల వచ్చిన టీజర్ కూడా చాలా ఇంట్రస్ట్రింగ్ గా ఉండటంతో లై సినిమాపై మంచి బజ్ వచ్చింది.  ఇవన్నీ కలిసొచ్చి లై సినిమా శాటిలైట్ రైట్స్ కు రికార్డు స్థాయి రేట్ వచ్చింది. రూ. 7 కోట్ల వద్ద ఈ సినిమా శాటిలైట్ రైట్స్ క్లోజ్ అయ్యాయని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. నితిన్ సినిమాలన్నిటిలో శాటిలైట్ అత్యధిక ధర ఇదే కావడం విశేషం.  లై సినిమాను ఆగస్టు 11నాటికి థియేటర్లకు తీసుకురావాలని ఈ ఫిలిం మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా ఆడియో రిలీజ్ అయ్యే అవకాశముంది.

విషయం ఏంటంటే.. ఈ మధ్య కాలంలో స్టయిలిష్ కే స్టయిలిష్ అన్న తరహాలో వచ్చిన సినిమాలన్నీ కంటెంట్ సరిగ్గా లేక బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ 'పంజా'.. తరువాత గోపిచంద్ 'జిల్' సినిమాలు కూడా ఇలాగే టీజర్లతో తెగ రచ్చ చేశాయి. స్టయిలిష్ అనే పదానికి పర్యాయపదాలు అన్నట్లు ఉండటంతో వాటికి కూడా శాటిలైట్ రేట్లు.. ఇతర హక్కుల రేట్లు.. కోట్లలోనే పలికాయి. కాని రిజల్టు చూస్తే మాత్రం దిమ్మతిరిగింది. మరి 'లై' ఏమవుతుందో చూద్దాం!!