Begin typing your search above and press return to search.

నితిన్ కూడా ఖైదీయే అంటగా..

By:  Tupaki Desk   |   23 Feb 2017 11:22 AM GMT
నితిన్ కూడా ఖైదీయే అంటగా..
X
ఖైదీ.. ఖైదీ నెం 786.. ఖైదీ నెం 150.. మూడుసార్లూ చరిత్రను తిరగరాశారు మెగాస్టార్ చిరంజీవి. ప్రతీసారి భారీ హిట్టును కొట్టేస్తూ తన స్టామినా ప్రూవ్ చేసుకున్నారు. చూస్తుంటే ఇప్పుడు ఆ ఖైదీ ఫీవర్ తో డిజైనర్ నీరజా కోన.. హీరో నితిన్ ను ''ఖైదీ నెంబర్ లెస్'' అంటున్నట్లుంది.

ప్రస్తుతం యంగ్ డైరక్టర్ హను రాఘవపూడి డైరక్షన్లో నితిన్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పేరు లైయ్ (LIE). లైఫ్ ఈజ్ ఎండ్లెస్ అనే కాన్సెప్టుతో రూపొందుతోంది. ఈ సినిమాలో ఒక సీన్లో నితిన్ ఖైదీగా కూడా కనిపిస్తాడట. అదే ఫోటోను ఇప్పుడు డిజైనర్ నీరజా కోన షేర్ చేసింది. ఆ సందర్భంగా ఇతను ఖైదీ నెంబర్ లెస్ అంటూ సరదాగా కామెంట్ చేసింది కూడా. అయితే ఈ సినిమాలో నితిన్ అసలు ఖైదీగా ఎందుకు కనిపిస్తున్నాడు.. ఇది లవ్ స్టోరీయేనా లేకపోతే ఇంకేదైనా స్టోరీయా అంటూ అందరూ స్టన్ అయిపోతున్నారు.

ఈ సినిమా తరువాత నితిన్ మరో యంగ్ డైరక్టర్ కృష్ణ చైతన్య డైరక్షన్లో ఒక సినిమాను చేయనున్నాడు. ఆ సినిమాను పవన్ కళ్యాణ్‌ అండ్ త్రివిక్రమ్ జాయింట్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/