ఎక్స్ క్లూజివ్: నితిన్ (ఇష్క్ ఫ్లాప్ అయితే ఇండస్ట్రీని వదిలేసేవాడిని!)

Wed Aug 09 2017 15:45:44 GMT+0530 (IST)

పదిహేనేళ్ల కెరీర్ లో చాలా అటుపోట్లు చూస్తూ హీరోగా తనకంటూ ఓ మార్కెట్ సెట్ చేసుకున్నాడు లవర్ బాయ్ నితిన్. ఆగస్ట్ 11న లై అనే యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్న ఏ.సత్యంతో(నితిన్ తో) తుపాకీ డాట్ కామ్ ఒక స్పెషల్ చిట్ చాట్* జయం టు లై ఈ లాంగ్ జర్నీ గురించి ఏం చెబుతారు?

దాదాపు 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అదృష్టం అనుకోవాలి. ఓ రోలర్ కోస్టర్ రైడ్ లా అనిపిస్తుంది  

* హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువుగా వచ్చాయని ఎప్పుడు అనిపించలేదా?

నాకే నాకు ప్రతి ఒక్క యాక్టర్ కెరీర్ లో బ్యాడ్ టైమ్ వస్తుంది అలాంటి ఫేజ్ నాకు రావడం మంచిదే అయింది. ఎందుకంటే ఆ టైమ్ లో నేను చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా నన్ను వూరికే పొగిడే వాళ్లని నమ్మకూడదనే నిర్ణయం నాకు ఫ్లాపులు వచ్చిన టైమ్ లోనే తీసుకున్నాను

* 15 ఏళ్ల కెరీర్ లో మీరు ఓ నటుడిగా మీరు నేర్చుకున్నవి ఏంటి?

ఓ యాక్టర్ గా నేను ఇంకా చాలా నేర్చుకోవాలి నటుడిగా నాకు నేనే మార్కలు ఇచ్చుకుంటే 10 కి 5 మార్కులే వేసుకుంటాను.

* ఎందుకు అంత లో ఫ్రొఫైల్ లో ఉంటారు?

నాకు చాలా సిగ్గు ఎక్కువ జనాల్లో తిరగడానికి ఎక్కువుగా ఇష్టపడను మా ఇంట్లో జరిగే ఫంక్షన్లకే తక్కువుగా వెళ్తుంటాను ఐమ్ లైక్ ఇంట్రావర్ట్.

* కెరీర్ లో అబద్ధాలు ఎక్కువ ఉపయోగపడ్డాయ లేక నిజాల?

నిజాలు చెబితే ఎవరికి అసలు నచ్చదు అది ఓన్లీ అమ్మాయిలకే అని చెప్పను అసలు ఎవరికి నిజాలు అంతగ మింగుడపడవు సినిమా విషయానికే రండి సినిమా ఎలా ఉంది అనే ప్రశ్నకి సినిమాల బాగాలేకపోయిన బాగుందనే వాళ్లు చాలా మంది మనకి కనిపిస్తారు అలానే నా కెరీర్ లో సందర్భానుసారంగా చాలా అబద్ధాలు చెప్పవలసి వచ్చింది. సో కెరీర్ లో ఎదగాలంటే నిజాలతో పాటు అబద్ధాలు అవసరమే. అబద్ధాలకే ఇండస్ట్రీలో వాల్యూ ఉంది అని నేను నమ్ముతున్నా.

* అఆ తరువాత మీ మార్కెట్ పెరగడంతో లై బడ్జెట్ కూడా పెంచారట నిజమేనా?

ఇది నిజమే కావచ్చు అఆ తో నా మార్కెట్ పెరిగింది ఆఆకి వచ్చిన కలెక్షన్స్ బేస్ చేసుకునే లై దర్శకనిర్మాతలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారేమో. అయితే కథ కూడా ఇక్కడ అంత బడ్జెట్ డిమాండ్ చేస్తుంది. దాదాపు 75 రోజులు పాటు ఈ సినిమాని అమెరికాలో షూట్ చేశాం.

* లై లో మీ పాత్ర ఎలా ఉండబోతంది?

రెండు వేరియేషన్లు ఉన్న పాత్రను ఇందులో చేశాను ఇంతకన్నా ఎక్కువ చెబితే థ్రిల్ పోతుంది(నవ్వుతూ)

* అర్జున్ ని విలన్ గా ఎంచుకోవడానికి కారణం?

కథ రీత్య హీరో కంటే విలన్ చాలా పవర్ ఫుల్ గా ఉండాలి. ఆ క్యారెక్టర్ కు అర్జున్ గారు సూట్ అవుతారని భావించి ఆయన్ని ఎప్రోచ్ అయ్యాము. గతంలో శ్రీ ఆంజనేయంలో అర్జున్ గారితో కలిసి నటించాను. ఇప్పుడు మరోసారి ఆయనతో నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

* లై కథ వినగానే మీకు వచ్చిన మొదటి అభిప్రాయం?

హను కథ చెప్పగానే ఒప్పుకున్నా ఆ తరువాత ఓ కొత్త ప్రయోగం చేస్తున్నాం అని ఫీల్ అవ్వడం స్టార్ చేశారు.  షూట్ లో పాల్గొంటున్నప్పుడు హను చెప్పే సీన్స్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు సినిమా రిలీజ్ తరువాత నాకు ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ మారుతుందేమో అనే ఆశ మొదలైంది. ఏం జరుగుతుందో చూద్దాం.

* పూరీ పై కామెంట్స్ చేశారు పబ్లిసిటీ కోసమా?

అస్సలు కానే కాదు నేను ఆ రోజు చెప్పింది ఒకటి వాళ్లు బయటికి చెప్పింది మరొకటి పూరీ సార్ అంటే నాకు చాలా గౌరవం. అందుకే ట్విట్టర్ లో కూడా నేను వివరణ ఇచ్చా.

* పవన్ కళ్యాణ్ తో మల్టిస్టారర్ ఎప్పుడు చేస్తున్నారు?

కళ్యాణ్ గారు నేను కలిసి చేసే సినిమా మల్టీస్టారర్ అవ్వదు. ఎందుకంటే ఆయన ముందు నేను స్టార్ ని కాదు జస్ట్ ఓ మాములు నటుడుని అంతే. ఆయన సినిమాలో అలా వచ్చి ఇలా వెళ్లిపోయే రోల్ ఇచ్చినా పర్వాలేదు నేను చేయడానికి సిద్ధం.

* కళ్యాణ్ నిర్మాణంలో నటిస్తా అని ఎప్పుడైనా ఊహించారా?

నేను హీరో అయ్యాక ఫీలైన మోస్ట్ హ్యపీ ముమొంట్స్ ఏమైనా ఉన్నాయంటే. అవి కళ్యాణ్ గారి బ్యానర్ లో సినిమా ఒప్పుకున్న క్షణాలే. అంతా ఓ కలలా జరిగిపోయింది.

* లై ట్రైలర్ లో యాక్షన్ పార్ట్ ఎక్కువుగా కనిపిస్తుంది ఫ్యామిలీ ఆడియెన్స్ కి నచ్చుతుందా?

అది ఇప్పుడే చెప్పలేను నా గత సినిమాలు మాదిరిగా లై లో సెపరేట్ ఫ్యామిలీ ట్రాక్స్ లేవు. కానీ అన్ని వర్గాలకి ఈ సినిమా నచ్చుతుందని నేను భావిస్తున్నా. అదే నమ్మకంతో ఈ సినిమాని తెరకెక్కించాము.

* నిర్మాతగా మారాలనే ఆలోచనలో కూడా సుఖం లేదు కదా ఆ రిస్క్ ఎందుకు చేస్తున్నారు?

నాకు సినిమా తప్ప ఇంకేం తెలీదు. నేను హీరోగా ఉంటే చాలా కంఫర్ట్ లైఫ్ ని ఎంజాయ్ చెయోచ్చు. కానీ నిర్మాణంలో కూడా ఏదో తెలియని కిక్ ఉంది. అందుకే ప్రొడ్యూసర్ గా మారాను. సినిమాలతోనే డబ్బు సంపాదించాలి సినిమాల్లోనే డబ్బులు పోగొట్టుకోవాలనే రూల్ పెట్టుకున్నా. ఫ్యూచర్ లో కూడా సినిమాలు నిర్మిస్తాను.

* ఇష్క్ లేకపోతే ఇప్పుడు మీరు ఏం చేసేవారు?

ఇష్క్ కోసం చాలా కష్టపడ్డాను మాకు ఉన్నదంతా ఆ సినిమాలో పెట్టాము. సినిమా రిలీజ్ కి ముందు రోజు ఓ సారి షో చూశాను హిట్ అవుతుంది అనిపించింది. ఒక వేల సినిమా హిట్ కాకపోతే జనాలకి ఇంక నన్ను చూడటం ఇష్టం లేదేమో అని ఇండస్ట్రీని వదిలేద్దాం అనే నిర్ణయం తీసుకున్నా. కానీ ఇష్క్ హిట్ అయింది ఇప్పుడు లై రిలీజ్ అవుతుంది.

* హోమ్ బ్యానర్ కంటే 14 రీల్స్ బెస్ట్ అని చెప్పారట నిజమేనా?

నిజంగా 14 రీల్స్ నాకు హొమ్ బ్యానర్ లా అనిపించింది నాకు వాళ్లు పెట్టుబడి పెట్టినంత మార్కెట్ ఉందో లేదో పక్కనపెడితే. కథను నమ్మి కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించే అతి తక్కువ బ్యానర్స్ లో 14 రీల్స్ ఒకటి. మా సొంత బ్యానర్ లో కూడా కొన్ని పరిమితులు మధ్య సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే 14 రీల్స్ బెస్ట్ అని చెప్పాను.

* ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?

ప్రస్తుతానికి లై రిలీజ్ టెన్షన్ లో ఉన్నాను ఇది పక్కనపెడితే పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా ఉంది. దాని పైనే పూర్తిగా దృష్టి పెట్టబోతున్నా. లై తో పాటు ఆ సినిమా కూడా నాకు చాలా కీలకం.