Begin typing your search above and press return to search.

అబద్ధంతో మారిపోనున్న నితిన్ రేంజ్

By:  Tupaki Desk   |   16 July 2017 6:30 AM GMT
అబద్ధంతో మారిపోనున్న నితిన్ రేంజ్
X

యంగ్ హీరో నితిన్ ఇండస్ట్రీలో దశాబ్దకాలంపైగా కొనసాగుతున్నా.. స్టార్ స్టేటస్ సంపాదించుకునేందుకు బాగానే ఆలస్యమైంది. మధ్యలో కొన్నేళ్ల పాటు హిట్ మొహం చూడకుండా గడపాల్సి రావడమే ఇందుకు కారణంగా చెప్పచ్చు. అయితే.. కెరీర్ ని మళ్లీ పట్టాలెక్కించాక మాత్రం నితిన్ కెరీర్ లో వేగం పెరిగింది.

గతేడాది వచ్చిన త్రివిక్రమ్ మూవీ.. అఆ తో స్టార్ హీరో స్థాయి వసూళ్లను రాబట్టిన నితిన్.. ఆ తర్వాత మరీ జాగ్రత్తగా ఉంటున్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'లై'.. నితిన్ స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళుతుందనే అంచనాలున్నాయి. ఈ మూవీ కోసం బల్క్ డేట్స్ ఇచ్చి కష్టపడుతున్నాడు నితిన్. అమెరికాలో 2 నెలలకు పైగా షూటింగ్ జరగగా.. ఇప్పుడు హైద్రాబాద్ లో మిగిలిన భాగాన్ని పూర్తి చేయడంలో బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో. థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతున్న ఈ మూవీతో.. నితిన్ రేంజ్ మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆగస్ట్ 11న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ కోసం.. శాటిలైట్ విషయంలో కూడా గట్టి పోటీ కనిపిస్తోంది. లై శాటిలైట్ హక్కుల కోసం 2 ఛానల్స్ గట్టిగా పోటీపడుతుండగా.. ప్రస్తుతం బేరాలు 7 కోట్ల రేంజ్ లో జరుగుతున్నాయి. ఇది నితిన్ కెరీర్ లోనే అత్యధికం కావడం విశేషం. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో.. నితిన్- మేఘల జంట కనువిందు చేయనుందనే టాక్ వినిపిస్తోంది.