Begin typing your search above and press return to search.

భీష్మకు ముహూర్తం ఫిక్స్

By:  Tupaki Desk   |   15 July 2018 8:08 AM GMT
భీష్మకు ముహూర్తం ఫిక్స్
X
ఛలోతో మొదటి సినిమాకే మంచి హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల కొత్త ప్రాజెక్ట్ త్వరలో పట్టాలు ఎక్కనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆగస్ట్ మొదటి వారంలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. నితిన్ హీరోగా రూపొందే ఈ మూవీకి భీష్మ అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా తెలిసింది. అంటే పేరులోనే ఇదో పెళ్లంటే ఇష్టం లేని బ్రహ్మచారి కథ అని తెలుస్తోంది. ఛలోలో రెండు వర్గాల కక్షల మధ్య ప్రేమను పుట్టించిన వెంకీ కుడుముల ఈ సారి ఆజన్మ బ్రహ్మచారితో హాస్యాన్ని పండించబోతున్నాడు. స్క్రిప్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యిందని చిన్న చిన్న ప్యాచెస్ ని పూర్తి చేయటంలో వెంకీ కుడుముల బిజీగా ఉన్నట్టు తెలిసింది. ఇక నితిన్ శ్రీనివాస కళ్యాణం ఫినిషింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆగస్ట్ 9న విడుదల కానున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్. దిల్ రాజు నిర్మాత కావడంతో పాటు నేషనల్ అవార్డు విన్నర్ శతమానం భవతి దర్శకుడు వేగ్నేశ సతీష్ టేకప్ చేయటం ఆసక్తిని పెంచుతోంది.

ఇక భీష్మ పేరుతో ఇప్పటి దాకా ఒకే సినిమా స్వర్గీయ ఎన్టీఆర్ హీరోగా భీష్ముడి కథను తీసుకుని మహాభారత గాధతో తీశారు. ఈ భీష్మ మాత్రం మోడరన్ జెనెరేషన్ లో పెళ్లంటే వద్దంటుంటాడు అని టాక్. నితిన్ ఇలా పురాణం పురుషుల టైటిల్స్ తో చేయటం కొత్త కాదు. గతంలో ద్రోణ్యాచార్యులను తలపించే పేరుతో ప్రియమణి జంటగా ద్రోణ అనే సినిమా చేసాడు. అంతకు ముందు రాముడిని తలపించేలా రామ్ అని ఒకటి ట్రై చేసాడు. వాటి ఫలితాల సంగతి పక్కన పెడితే ఇలా వెరైటీగా టైటిల్స్ పెట్టడం లో నితిన్ మంచి ఆసక్తి చూపిస్తున్నాడు. అఆ-చల్ మోహనరంగా-శ్రీనివాస కళ్యాణం అన్ని చక్కనైన తెలుగు అక్షరాలు పేర్లతో కూడిన టైటిల్స్. ఇప్పుడు ద్రోణ కూడా ఇదే బాపతులో చేరబోతోంది. ఛలో తరహాలోనే దీన్ని కూడా కామెడీ ఎంటర్ టైనర్ గా వెంకీ కుడుములు మలచబోతున్నట్టు టాక్.