Begin typing your search above and press return to search.

నితిన్-మేఘా జోడీ.. రివర్స్ పంచ్ ఇస్తుందా?

By:  Tupaki Desk   |   21 March 2018 3:30 PM GMT
నితిన్-మేఘా జోడీ.. రివర్స్ పంచ్ ఇస్తుందా?
X
చిత్ర సీమలో నెగెటివ్ సెంటిమెంట్లు ఎక్కువ. ఒక కాంబినేషన్ లో ఒక ఫ్లాప్ రాగానే.. దానికి ఒక ముద్ర పడిపోతుంది. ఫెయిల్యూర్ కాంబినేషన్ అంటూ వాటిని రిపీట్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు. సినిమా ఫలితంతో ఏమాత్రం సంబంధం లేని హీరోయిన్ల మీద.. నటీనటుల మీద ఐరెన్ లెగ్ అని ముద్ర వేయడం కూడా పరిశ్రమలో బాగా జరుగుతుంటుంది. ఐతే 90 శాతం ఫెయిల్యూర్లు ఉండే ఇండస్ట్రీలో ఇలాంటి సెంటిమెంట్లను పట్టించుకుంటే అంతే సంగతులు. అందుకే కొందరు వీటిని లైట్ తీసుకుని మళ్లీ ఫెయిల్యూర్ కాంబినేషన్లను రిపీట్ చేస్తుంటారు. అలా రెండో ప్రయత్నంలో విజయవంతమైన కాంబినేషన్లు ఎన్నో ఉన్నాయి. నితిన్-మేఘ జోడీ కాంబో కూడా ఇదే జాబితాలోకి చేరుతుందని ‘చల్ మోహనరంగ’ టీం నమ్ముతోంది.

‘లై’ సినిమాతో తొలిసారి జత కట్టారు నితిన్-మేఘ. ఈ జోడీకి మంచి అప్లాజే వచ్చింది. సినిమాలో వీళ్ల కెమిస్ట్రీ బాగానే పండింది. మేఘా గురించి కూడా పాజిటివ్‌ గానే మాట్లాడుకున్నారు. కానీ ఆ సినిమా ఆడకపోయేసరికి వాళ్లది ఫెయిల్యూర్ కాంబో అంటూ సెంటిమెంట్లు తెరమీదికి తీసుకొచ్చారు. కానీ నితిన్ ఇదేమీ పట్టించుకోకుండా తన తర్వాతి సినిమాలోనూ ఆమెతోనే జోడీ కట్టాడు. ‘చల్ మోహన రంగ’ ప్రోమోల్లో ఈ జోడీ చక్కగా కనిపిస్తోంది. ఇంతకుముందు ‘ఖతర్నాక్’ సినిమాలో రవితేజ-ఇలియానా జోడీ ఫెయిల్ అయిందని.. ‘కిక్’ సినిమాకు మళ్లీ వాళ్లు మళ్లీ జత కడుతుంటే ఏవేవో కామెంట్లు చేశారు. కానీ ఆ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఇండస్ట్రీలో ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. మరి నితిన్-మేఘ కూడా అదే తరహాలో రివర్స్ పంచ్ ఇస్తారేమో చూద్దాం.