Begin typing your search above and press return to search.

ఈ పోస్టర్లో కెమిస్ర్టీ అదిరింది

By:  Tupaki Desk   |   9 Aug 2017 10:30 AM GMT
ఈ పోస్టర్లో కెమిస్ర్టీ అదిరింది
X
కెరీర్ మొదట్లో క్యూట్ లవ్ స్టోరీస్ తో సినిమాలను చేసిన నితిన్ మెల్ల మెల్లగా మాస్ తరహా సినిమాలపై అడుగులు వేశాడు. ఆ తర్వాత రొమాంటిక్ తరహా చిత్రాలతో మంచి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఇష్క్ సినిమాలో నిత్య మీనన్ తో చేసిన చిన్న చిన్న రొమాన్స్ సీన్స్ ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు లై లో కూడా అంతకంటే ఎక్కువనే రొమాన్స్ చేసినట్లు తెలుస్తోంది.

మరో రెండు రోజుల్లో లై సినిమా రాబోతుందని సినిమా యూనిట్ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే లై సినిమాలో హీరోయిన్ మెగా ఆకాష్ ఆ పోస్టర్ లో హాట్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె డ్రెస్ చూస్తే ఎలాంటి వారికైనా మతి పోవాల్సిందే. ఆమె వేసిన షార్ట్ జీన్స్ ని చూస్తే ఓ వర్గం ప్రేక్షకులు థియేటర్స్ వరకు రావాల్సిందే.. అలాగే నితిన్ కూడా ఆమెను ముద్దాడుతున్న తీరు చాలా రొమాంటిక్ గా ఉంది. నితిన్ చాలా రోజుల తర్వాత ఈ తరహా స్టిల్ ఇచ్చాడనిపిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిందనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఇక మెగా ఆకాష్ కి ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ పది చేస్తున్నారు ఇక ఈ సినిమాలో ఆమె అందాల ప్రదర్శన గట్టిగానే ఉంటుందని పోస్టర్లలో తెలిసిపోతుండడంతో ఈ సినిమాను తప్పకుండా చూడాలి అంటున్నారు.

ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రంపై నితిన్ చాలా నమ్మకాన్ని పెట్టుకున్నాడు. మరి మేఘ ఆకాష్ అందాలు హను రాఘవపూడి దర్శకత్వం ఈ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడతాయో తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.