ఏంటి దీనికేనా ఇంత ఫోజ్ కొట్టింది?

Wed Feb 21 2018 10:03:37 GMT+0530 (IST)

ఇలియానా దేవదాస్ సినిమా తో అరంగేట్రం చేసిన గోవా బ్యూటీ. సినిమా పెద్దగా ఆడకపోయినా బోలెడు ఆఫర్లు చిక్కాయి పెద్ద హీరోయిన్ కూడా అయిపోయింది. ఒక రకంగా ఈమెను హీరోయిన్ చేసిందే మన టాలీవుడ్ డైరెక్టర్లు. కానీ ఇక్కడ సినిమాలు దక్కక బాలీవుడ్ కి మారి ఇప్పుడు తెలుగు సినిమాల మీదనే ఘాటు కామెంట్ల చేసేస్తోంది.హిందీ లో అడపాదడపా సినిమాలు చేస్తూ ఎదో అలా అలా నెట్టుకొస్తోంది ఈ భామ. పెద్ద బ్లాక్ బస్టర్ కు ఏమి లేకపోయినా సంవత్సరానికి ఒక సినిమా అన్నట్టు గడిపేస్తోంది. బాద్షాహో అనే అజయ్ దెవగన్ సినిమా లో కేవలం ఒక కోటు మాత్రమే వేసుకుని కెమెరా ముందు నిలబడ్డ ఈమె మళ్ళీ అజయ్ తోనే రెయిడ్ అనే సినీమా చేస్తోంది. సినిమాలో ఒక పాట వీడియో ను ఈమధ్యనే విడుదల చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో సౌత్ సినిమాలు కేవలం అందాన్ని మాత్రమే చూపిస్తారు అంటూ బోలెడు పనికిరాని వ్యాఖ్యలు చేసిన ఈమె ఈ సినిమా లో ఏదో ఆస్కార్ రేంజ్ వర్క్ చేసేసినట్టు ఫోజ్ మాత్రం కొట్టింది. తీరా చూస్తే అందులో ఆమె చేసింది ఏమి లేదు. కేవలం ఒక మాములు పాట.

ఇందులో కంటెంట్ ఏమి లేదు కాబట్టే కాబోలు దక్షిణాది సినిమాల పైన కామెంట్స్ చేసి మరీ ప్రమోట్ చేస్తోంది. కనీసం బాలీవుడ్ లో ఒక్క పెద్ద హిట్ కూడా పడకముందే ఈమె కామెంట్లు భరించలేకపోతున్నాం. ఎదో సినిమాలు ఏమి రావట్లేదు అన్న అక్కసు మొత్తం చూపించడానికి చేస్తున్నట్టు లేదు ఈమె ప్రవర్తన?