Begin typing your search above and press return to search.

డబ్బులు తీస్కో.. సందడి చేస్కో

By:  Tupaki Desk   |   21 May 2018 8:42 AM GMT
డబ్బులు తీస్కో.. సందడి చేస్కో
X
ఎంత చెట్టుకు అంత గాలి.. అలాగే ఎంత డబ్బులు ఇస్తే.. అంత చక్కటి మ్యూజిక్.. సేమ్ డిట్టోగా ఎంత గిడితే అంతటి పెర్ఫామెన్స్.. ఇదీ సినిమా తారల లెక్క. ఆన్ స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ ఇదే వరుస. ట్వీట్లతో కూడా సంపాదించే రోజుల్లో.. ఊరికినే అభిమానంతో వచ్చి హంగామా చేస్తున్నారని అనుకోవడం పెద్ద పొరపాటు.

పలు మార్లు స్టేడియంలలో సినిమా తారలు హంగామా చేయడం చూస్తుంటాం. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ లో ఈ రచ్చ మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీరంతా ఆయా జట్టు జర్సీలను ధరించి.. తెగ హంగామా చేస్తుంటారు. నిజంగానే అభిమానంతో సపోర్ట్ చేసేస్తున్నారని అనుకోవడం సహజం. ఇక్కడ ఫోటోల్లో కనిపిస్తున్న భామ ఎవరో కాదు.. టాలీవుడ్ చందమామ కాజల్ చెల్లి నిషా అగర్వాల్. కాజల్ తో పాటు ఈ భామ కూడా తెలుగులోనే ఎక్కువగా కనిపించింది. ఇలాంటి భామలు బతికింది బతుకుతోంది తెలుగు సినిమాలపైనే.

నిషా తెలుగులో నాలుగు సినిమాలు చేస్తే.. తమిళంలో ఒకే ఒక్క సినిమా చేసింది. అయినా సరే.. మ్యాచుల విషయానికి వచ్చేసరికి.. తమిళ టీం చెన్నై సూపర్ కింగ్స్ కే సపోర్ట్ ఇచ్చేందుకు వెళ్లింది. ఇదేమీ ఊరికినే కాదు అని టాక్. కాజల్ మాదిరిగానే ఈ భామ కూడా పక్కా కమర్షియల్ అంటారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్లకి సపోర్టుగా ఇలా స్టేడియంలలో మెరుస్తున్నారు భామలు. జనాలేమో ఇదంతా మనసులోంచి పొంగి పొర్లిపోయే అభిమానం అనుకుంటూ ఉంటారు. కానీ దాని వెనుక ఓ కమర్షియల్ కోణం కూడా ఉంది.