Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: కాజు సిస్టర్ బికినీ స్టార్

By:  Tupaki Desk   |   19 Jun 2019 6:32 AM GMT
ఫోటో స్టొరీ: కాజు సిస్టర్ బికినీ స్టార్
X
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కు ఒక చెల్లి ఉందనే సంగతి తెలుసు కదా.. ఆ చెల్లి పేరు నిషా అగర్వాల్. టాలీవుడ్ లో ఓ మూడు నాలుగు సినిమాల్లో నటించింది.. 'ఏమైంది ఈ వేళ'.. 'సోలో'.. 'సుకుమారుడు'.. నిషా ఫిల్మోగ్రఫీలోని సినిమాలు. ఇవి కాకుండా మలయాళంలో కూడా రెండు సినిమాల్లో నటించింది. అయితే హీరోయిన్ కెరీర్లో జోరు పెరిగే సమయంలో కరణ్ వాలేచాను వివాహం చేసుకొని శ్రీమతిగా మారింది. సినిమాలకు దూరంగా ఉంటోంది. నిషా -కరణ్ దంపతులకు ఇషాన్ అనే బాబు కూడా ఉన్నాడు. గత కొన్నేళ్ళుగా గ్లామర్ కు దూరంగా ఉన్న నిషా తాజాగా ఒక్కసారిగా బికినీ గేర్ వేసింది.

నిషా ప్రస్తుతం తన ఫ్యామిలీతో వెకేషన్ లో ఉంది. ఇండోనేషియాలో బ్యాన్యాన్ ట్రీ బింటన్ అనే రిసార్టులో సేదదీరుతోంది. ఈ సందర్భంగా తనలోని గ్లామర్ ను ఒక్కసారిగా బైటకు తీసి.. బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో దిగి జలపుష్పంలా మారిపోయింది. ఎన్నో పోజులు ఇచ్చింది..ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. చేపలు నీటిలో ఎంత సహజంగా ఉంటాయో అంత సహజంగా నీటిపై తేలియాడింది. ఒక ఫోటోలో ఒక కాలిని పైకి లేపింది.. మరో ఫోటోలో పూల్ నీటిలో ఉంటూనే బయట ఉన్నఅందమైన ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్టుగా పోజిచ్చింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. గ్లామర్ లో అక్క కాజల్ కు ఏమాత్రం తీసిపోదు ఈ నిషా.

ఈ ఫోటోకు కిరాక్ రెస్పాన్స్ వచ్చింది. "కాజు సిస్టర్ బికినీ స్టార్".. "లక్కీ పూల్.. బికినీలో ఏంజెల్".. "నిషా ఈజ్ బ్యాక్" అంటూ కామెంట్లు పెట్టారు. ఒక నెటిజన్ మాత్రం 'ఈ ఫోటోల్లో క్లారిటీ లేదు.. అన్నీ లాంగ్ షాట్స్.. క్లోజప్ ఫోటోలు పోస్ట్ చెయ్యవా ప్లీజ్" అంటూ అభ్యర్థించాడు! ఈ అల్లరి నెటిజనుల సంగతేమో కానీ నిషా బికినీల వాలకం చూస్తుంటే త్వరలో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉన్నట్టు అనిపిస్తోంది.