Begin typing your search above and press return to search.

టాలీవడ్ లోకి మరో కొత్త విలన్

By:  Tupaki Desk   |   2 Sep 2015 7:47 AM GMT
టాలీవడ్ లోకి మరో కొత్త విలన్
X
హీరోయిన్ లనే కాదు.. విలన్ లను కూడా ముంబయి నుంచి దిగుమతి చేసుకోవడం మన దర్శకులకు అలవాటు. ఈ సంప్రదాయం 90ల నుంచి ఉంది. గత రెండు దశాబ్దాల్లో లెక్కలేనంత మంది బాలీవుడ్ విలన్లు టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. కొందరు విజయవంతమయ్యారు. కొందరు ఫెయిలయ్యారు. ఐతే ప్రతి కొత్త విలనూ కొన్నాళ్లకు పాతబడిపోతాడు. ప్రేక్షకులు మళ్లీ కొత్త ముఖాల కోసం చూస్తారు. అందుకే ఎప్పటికప్పుడు మన డైరెక్టర్లు బాలీవుడ్ వైపు ఓ లుక్కేస్తుంటారు. ఈ మధ్య కాలంలో రవికిషన్, కబీర్ ఖాన్ విలన్లుగా టాలీవుడ్లో మంచి పేరు సంపాదించారు. ఇప్పుడు వాళ్ల బాటలో తనదైన ముద్ర వేయడానికి ఓ కొత్త విలన్ వస్తున్నాడు. అతనే నికితిన్ ధీర్.

వరుణ్ తేజ్, క్రిష్ ల ‘కంచె’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు నికితిన్. ట్రైలర్ తో ఇన్ స్టంట్ గా జనాలకు ఎక్కేశాడు నికితిన్. సినిమాలో విలన్ క్యారెక్టర్ కి మంచి ప్రాధాన్యం ఉన్న సంగతి ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. నికితిన్ పాత్రలో, అతడి నటనలో ఇంటెన్సిటీ బాగానే అర్థమవుతోంది. సినిమా హిట్టయితే నికితిన్ ఇక్కడ ఫుల్ బిజీ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నికితిన్ కెరీర్ విషయానికొస్తే అతను పంకజ్ ధీర్ అనే సీనియర్ నటుడి కొడుకు. హృతిక్ రోషన్ సినిమా ‘జోధా అక్బర్’తో పరిచయమయ్యాడు. ఆ తర్వాత మిషన్ ఇస్తాంబుల్, రెడీ, దబాంగ్-2, చెన్నై ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించాడు. క్రిష్ తో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ కూడా చేశాడు. ఆ సందర్భంగా అతడి టాలెంట్ తెలుసుకున్న క్రిష్... ‘కంచె’లో ఛాన్స్ ఇచ్చాడు.