Begin typing your search above and press return to search.

హాటీ ప్రొఫైల్ చూస్తే షాక్ తింటారు

By:  Tupaki Desk   |   21 Sep 2019 3:53 PM GMT
హాటీ ప్రొఫైల్ చూస్తే షాక్ తింటారు
X
2016 యంగ్ ఉమెన్ అఛీవ‌ర్ అవార్డ్.. 2019 ఎక్సెప్ష‌న‌ల్ ఉమెన్ ఆఫ్ ఎక్స‌లెన్స్ అవార్డ్... ది బెస్ట్ టీఈడీ ఎక్స్ స్పీక‌ర్ .. మైక్రో బయాల‌జిస్ట్.. మోటివేష‌న‌ల్ స్పీకర్.. సిల్వ‌ర్ లైనింగ్స్ అధినేత‌.. ఇన్ని ర‌కాల అర్హ‌త‌లు ఉన్న ఈ యంగ్ బ్యూటీని చూస్తుంటే షాక్ త‌గులుతోంది క‌దూ? ఈ అర్హ‌త‌ల‌న్నిటినీ మించిన మ‌రో అర్హ‌త టాప్ మోడ‌ల్. అందుకే ఇన్ స్టా తిర‌గేస్తే.. షాక్ కి గుర‌వ్వాల్సిందే.

ఇన్ని అర్హ‌త‌లు ఉండి బాలీవుడ్ లో క‌థానాయిక అవ్వాల‌నుకుంటోందా లేక సౌత్ లో ఏమైనా ట్రై చేస్తోందా? అన్న డౌట్ రాకుండా ఉండ‌దు. అందం చందం వాడి వేడి ఎందులోనూ అస్స‌లు త‌గ్గ‌ని ఈ బ్యూటీకి అలాంటి అవ‌కాశం ఉన్నా వృత్తిప‌రంగా పూర్తిగా వేరే రంగంలో రాణిస్తోంది. ఒక‌వేళ క‌థానాయిక అయినా అక్క‌డా త‌న‌దైన మాట తీరుతో నెగ్గుకొచ్చేయ‌డం ఖాయం. ఎందుకంటే మోటివేష‌న‌ల్ స్పీక‌ర్ క‌దా?

ఇంత‌కీ ఈ బ్యూటీ పేరేమిటి అంటే నిఖిత శ‌ర్మ‌. పోటీబ‌రిలో దిగితే మ‌ల్లూ భామ‌ల‌కైనా చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే అన్న‌ట్టుగా ఉంది ఈ అమ్మ‌డి వాల‌కం. ఇన్ స్టాగ్రమ్‌లో చ‌లిమంట‌లు పుట్టిస్తున్న ఆ పోటోలు చూస్తే ఎవ‌రైనా ఇట్టే అంగీక‌రించే నిజ‌మే ఇది. బికినీ లుక్ .. స్విమ్ సూట్.. డిజైన‌ర్ లుక్ .. అంతా వెస్ట్ర‌న్ రేంజులోనే. అందాలు ఉన్న‌ది ఆరాధించేందుకే కాదు చూపించేందుకు కూడా. దానికి ఫీల‌వ్వాల్సింది లేద‌ని ఇన్ స్టాలో ఫిలాస‌ఫీని మెయింటెయిన్ చేస్తోంది నిఖిత శ‌ర్మ‌. మొన్న‌ సెప్టెంబ‌ర్ 15న టీఈడీ ఎక్స్ నాలుగో ఎడిష‌న్ అఫీషియ‌ల్ స్పీక‌ర్ గా అద‌ర‌గొట్టేసిన ఈ భామ ఉచితంగా బోలెడ‌న్ని ఆస‌క్తిక‌ర ఐడియాలిస్తుంది తెలుసా?