Begin typing your search above and press return to search.

నికిత ఇలాంటి పాత్రలకు వచ్చేసిందా!

By:  Tupaki Desk   |   31 Aug 2016 7:30 AM GMT
నికిత ఇలాంటి పాత్రలకు వచ్చేసిందా!
X

హాయ్ అంటూ ప్రేక్షకులను పలకరించి.. ఆ తర్వాత డజనుకు పైగా తెలుగు సినిమాలతో పాటు.. అంతకు మించిన సంఖ్యలోనే కన్నడ.. తమిళ్.. మలయాళ సినిమాల్లో నటించింది నికిత. 13 ఏళ్లుగా సౌత్ లో హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేస్తున్న ఈ భామకు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయ్ కానీ.. అవేవీ కెరీర్ కి బ్రేక్ ఇచ్చేవి టర్న్ ఇచ్చే రేంజ్ వి కావు. అందుకే తన కెరీర్ కి తనే టర్నింగ్ ఇచ్చుకోవాలని డిసైడ్ అయిపోయింది నికితా తుక్రల్.

టాలీవుడ్ లో ఈ చిన్నది హోమ్లీ కేరక్టర్లనే ఎక్కువగా చేసింది కానీ.. ఇప్పుడు ఓ ఐటెం సాంగ్ తో పలకరించేందుకు రెడీ అయిపోయింది. శరభ అనే టైటిల్ పై రూపొందుతున్న సినిమాలో ఐటెం గాళ్ గా నటిస్తోందీ నికిత. ఈ చిత్రంలో జయప్రద కీలక పాత్రలో నటిస్తుండగా ఆకాష్ సహదేవ్.. మిస్త్రీ చక్రవర్తిలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ భామలు ఐటెం సాంగులతో కెరీర్ కంటిన్యూ చేసేందుకు ట్రై చేయడం చూస్తూనే ఉన్నాం కానీ.. వాళ్లంతా స్టార్ హీరోల సినిమాలో అవకాశం వస్తే, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు.

కానీ నికిత మాత్రం ఓ సాధారణ హీరో సినిమాలో ఐటెం సాంగ్ లో నటించేందుకు నికిత ఒప్పుకోవడం ఆశ్చర్యకరం. చివరకు 'సంబరం' భామ ఇలా అయిపోయిందన్న మాట అనే టాక్ వినిపిస్తోంది.