Begin typing your search above and press return to search.

పెళ్లయినా.. హాయ్ బ్యూటి తగ్గట్లేదు

By:  Tupaki Desk   |   29 April 2017 12:30 AM GMT
పెళ్లయినా.. హాయ్ బ్యూటి తగ్గట్లేదు
X
ఓ 15 ఏళ్ల క్రితం ఈవీవీ సత్యన్నారాయణ పెద్ద కొడుకు 'హాయ్' అనే మూవీతో ఆర్యన్ రాజేష్ హీరోగా అరంగేట్రం చేస్తున్నపుడు.. అదే సినిమాతో అరంగేట్రం చేసిన బ్యూటీ నికిత తుక్రల్. అడపాదడపా తెలుగులో కనిపిస్తున్న ఈ బ్యూటీ.. దక్షిణాదిలోని ఇతర భాషల్లో ముఖ్యంగా తమిళ్ లో చాలానే సినిమాలు చేసింది.

గతేడాది పెళ్లి చేసేసుకని సెటిల్ అయిన నికితకు.. ఇప్పటికీ తమిళ్ లో డిమాండ్ బాగానే ఉంది. ప్రస్తుతం బొంగు(మోసం అని తెలుగు అర్ధం) అనే తమిళ్ మూవీలో ఐటెం సాంగ్ చేస్తోంది నికిత. పెళ్లయినా హాట్ హాట్ డ్రెస్ లతో.. రెచ్చగొట్టే స్టెప్పులతో అదరగొట్టేస్తోంది ఈ బ్యూటీ. తెల్లవారు ఝామున 3 గంటల వరకూ షూటింగ్ చేస్తున్నానని చెబుతూ.. ఓ చిన్ని వీడియోను తన సోషల్ మీడియా ఎకౌంట్లో పోస్ట్ చేసింది. అమ్మడి హాట్ నెస్ చూసి.. పెళ్లయిన బ్యూటీ అంటే నమ్మడం కాసింత కష్టమైన విషయమే.

రోడ్ మూవీతో తెరకెక్కుతునన్న ఈ బొంగు మూవీలో నటరాజన్ సుబ్రమణ్యన్.. రూహీసింగ్ లు ప్రధాన పాత్రలో పోషిస్తుండగా తాజ్ అనే కొత్త దర్శకుడు ఈ మూవీని రూపొందిస్తున్నాడు. దిండిగల్.. మదురై.. చెన్నై.. ముంబై పరిసరాల్లో దాదాపు రోడ్డు పైనే ఈ సినిమా అంతా సాగుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/